హీరో ధనుష్ అంటే వేరే…వెరే లెవెల్. అతగాడు తీసుకునే పాత్రలు కానీ చేసే సినిమాలు కానీ అదో మాదిరి. లేటెస్ట్ గా జగమేతంద్రియం ట్రయిలర్ వచ్చింది.
కరోనా కారణంగా నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్తోందీ సినిమా. ఇంకా కొంచెం సమయం వుంది. ముందుగా ట్రయిలర్ వదిలారు. గతంలో తమిళంలో వచ్చిన పలు గ్యాంగ్ స్టర్ సినిమాల లైన్ అయితే కనిపిస్తోంది కానీ సినిమా మొత్తం ముందే చెప్పినట్లు వేరే లెవెల్ లో వుండేలా కనిపిస్తోంది.
సాధారణంగా తమిళంలో ఎలాంటి సినిమా తీసిన, అక్కడి నేటివిటీ, అక్కడి వ్యవహారాలు కాస్త ఎక్కువే కనిపిస్తాయి. కానీ ధనుష్ ఈ సినిమాను పక్కా పాన్ ఇండియా సినిమాగా తయారుచేసే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.
అందుకు తగ్గట్టే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమాను చాలా రిచ్ గా, పక్కా అథెంటిక్ గ్యాంగ్ స్టర్ మూవీ అన్నట్లు ప్రెజెంట్ చేసినట్లు ట్రయిలర్ లో తెలుస్తోంది.