హీరో బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లుంది. ఇప్పటికే శివానందలహరి, శ్రీరామదండకం ఆలపించేసారు. జనాల్లోకి వదిలేసారు.
అహో బాలయ్యా అని ఫ్యాన్స్ జేజేలు పలుకుతుంటే, ఓహో బాలయ్య అని మరి కొందరు నిట్టూరుస్తున్నారు. అయితే ఈ ప్లస్ లు మైనస్ లు, పాజిటివ్ లు, నెగిటివ్ లు, ట్రోలింగ్ లు ఏవీ బాలయ్యకు పట్టవు. ఆయన అనుకున్నది చేసేస్తారంతే.
ఈ క్రమంలోనే మరోసారి గాత్రాన్ని సవరించుకోబోతున్నారని తెలుస్తోంది. ఈసారి ఆయన ఇంగ్లీష్ పాటనో మరోటో అందించబోతున్నారని బోగట్టా. ఈ మేరకు రిహార్సల్స్ చేస్తున్నారని, రికార్డ్ చేసి వుంచి మాంచి అకేషన్ చూసి విడుదల చేస్తారని తెలుస్తోంది.
సో..ఫ్యాన్స్ అండ్ ట్రోలర్స్ గెట్ రెడీ.