అమరావతి దీక్షలు రోడ్లపైకి రావొద్దు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది కేవలం అమరావతిలో మాత్రమే ఉండాలని.. మూడు నగరాల అభివృద్ధి వద్దని దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దీక్షలు ప్రస్తుతానికి వంద రోజులకు చేరుకున్నాయి. ఇప్పటికీ వారు శిబిరాల్లో కూర్చుంటూ……

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది కేవలం అమరావతిలో మాత్రమే ఉండాలని.. మూడు నగరాల అభివృద్ధి వద్దని దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దీక్షలు ప్రస్తుతానికి వంద రోజులకు చేరుకున్నాయి. ఇప్పటికీ వారు శిబిరాల్లో కూర్చుంటూ… ప్రదర్శనలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తికి.. దేశమంతటా ప్రత్యేక నిషేధాజ్ఞలు అమలవుతున్న నేపథ్యంలో.. అమరావతి ఆందోళనలకు కూడా తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. అమరావతి రాజధాని ముసుగులో జాతి ద్రోహానికి పాల్పడిన వారవుతారు.

దేశమంతా లాక్ డౌన్ అయిఉంది. దేశమంతా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏ నలుగురు ఒకచోట గుమికూడినప్పటికీ.. క్రిమినల్ కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. సొంత పనుల మీద వెళ్లడానికి రోడ్లపైకి వస్తున్న వారిని కూడా పోలీసులు చితక్కొడుతున్నారు. అలాంటి నేపథ్యంలో అమరావతి ఆందోళనలు చేస్తున్న వారిని మాత్రం పోలీసులు ఉపేక్ష ధోరణితో చూస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. అమరావతి దీక్షలు వంద రోజులకు చేరుకున్నాయంటూ వారు పండగ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

మంచిదే. వారు తమ నిరసనల్ని ఇంత ఘాటుగా తెలియజేయదలచుకుంటే.. మరో వంద రోజులు కూడా ఇలా దీక్షలు చేయవచ్చు. అందుకు ఎవ్వరూ కాదనరు. కానీ ప్రపంచ మానవాళి మొత్తం ప్రమాదం అంచున ఉన్నప్పుడు.. వారిలా గుంపులుగా గుమికూడుతూ.. శిబిరాలలో ప్రదర్శనల్లో ఉంటూ నిరసనలు చేయడం ఏమాత్రం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శిబిరాల్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నాం అంటూ చెబుతున్నారు గానీ.. వాస్తవంలో అలా జరగడం లేదు.

కానీ వీరి నిర్లక్ష్యాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. వీరి నిర్లక్ష్యం ఇప్పుడు కేవలం వీరికి మాత్రమే కాదు.. యావత్ సమాజానికి కూడా చేటు చేసే ప్రమాదం ఉంది. వారికి అంతగా తమ నిరసనలు తెలియజెప్పాలనుకుంటే గనుక.. ఇళ్లలోనే ఉంటూ.. అక్కడినుంచే ఫోటోలు వీడియోలు తీసుకుని తమ తమ పత్రికలకు పంపుకుంటూ.. ప్రచారం పొందవచ్చు. అంతే తప్ప దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనల్ని ఉల్లంఘించడం.. సామాజిక ద్రోహం అవుతుందని పలువురు వాదిస్తున్నారు.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

కత్రినా కష్టాలు