ఆ విచక్షణ ఉంటే లోకేష్ ఎలా అవుతాడు?

రాజకీయాల్లో శవ రాజకీయాలు చేయడం చాలా మామూలు సంగతి. ఒక మరణం సంభవిస్తే చాలు.. దానిని ఆసరాగా చేసుకుని తమ ప్రత్యర్థి పక్షాలను దుమ్మెత్తిపోయడానికి ఆ చావును వాడుకుంటూ ఉంటాయి. ఇది రాజకీయాల్లో చాలా…

రాజకీయాల్లో శవ రాజకీయాలు చేయడం చాలా మామూలు సంగతి. ఒక మరణం సంభవిస్తే చాలు.. దానిని ఆసరాగా చేసుకుని తమ ప్రత్యర్థి పక్షాలను దుమ్మెత్తిపోయడానికి ఆ చావును వాడుకుంటూ ఉంటాయి. ఇది రాజకీయాల్లో చాలా సహజంగా మారిపోయింది. కానీ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కమ్ముకుని ఉన్నది రాజకీయం కాదు.. ఒక చావు లేదా ఒక ప్రమాదం కాదు.. ఇదొక విలయం. ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దంటూ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కూడా పిలుపు ఇచ్చారు. కానీ.. ఆయన వందిమాగధులు, స్వయంగా ఆయన కొడుకు మాత్రం.. అచ్చంగా ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడానికే చూస్తున్నారు. లోకేష్ తన అపరిపక్వతను, అజ్ఞానాన్ని విచక్షణ లేని దుర్మార్గాన్ని ఆయన బయటపెట్టుకుంటున్నారు.

తెలంగాణలో ఉన్న హాస్టళ్లు అన్నింటినీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. అక్కడినుంచి విద్యార్థులు, ఉద్యోగులు కూడా.. ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లడానికి పయనం అయ్యారు. అయితే దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర సరిహద్దులు అన్నీ మూసేసిఉన్న సంగతి తెలిసిందే. దీంతో… తెలంగాణ నుంచి వెళుతున్న వారిని ఏపీ సరిహద్దుల వద్ద సహజంగానే పోలీసులు ఆపేశారు. ఈ ప్రతిష్టంభన కొన్ని గంటల పాటు ఉంది. తర్వాత కలెక్టరు ఇతర అధికారులు.. ఏపీలో ప్రవేశించే వారు తొలుత క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లేట్లయితే మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. దానికి తగ్గట్టుగా సరిహద్దుల వద్దే క్వారంటైన్ కేంద్రాలు కూడా ఏర్పాటుచేశారు.

అయితే ఈ విషయాన్ని లోకేష్ రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే, ఏపీ ప్రభుత్వం ఆపేసిందంటూ రాజకీయం చేస్తున్నారు. ఇంత హేయమైన చిల్లర రాజకీయాలు ఇటీవలి కాలంలో మరొకరు చేయడం జరగలేదు. ఎందుకంటే.. ఒకవేళ ఆ గుంపుల్లో ఏ ఒక్కరికి పాజిటివ్ ఉన్నా రాష్ట్రంలోకి అనుమతిస్తే జరగబోయే విపత్తలకు లోకేష్ బాధ్యత తీసుకుంటాడా? ప్రభుత్వం చాలా పద్ధతిగా పనిచేస్తోంది. వైద్యపరీక్షలు చేయకుండా రాష్ట్రంలోకి అనుమతించడం కరెక్టు కాదు. లోకేష్ కు విచక్షణ ఉంటే.. అనుమతించే వరకు ఆగాలని, విద్యార్థులనే ఉద్దేశించి ట్వీట్ పెట్టాలి.. ఇలాంటి సమయంలో సహనం అవసరం అని చెప్పాలి. కానీ.. ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి కుహనా ప్రయత్నాలు చేయడం నీచం అని పలువురు భావిస్తున్నారు.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి