ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సాయంతం మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆయన అయిదు గంటలకు మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు అన్నది ఇప్పుడు క్యూరియాసిటీగా వుంది. ఎందుకంటే కరోనా ప్రబలిన నేపథ్యంలో ప్రధాని, ముఖ్యమంత్రులు ఏం మాట్లాడబోతున్నా అది ఆసక్తి కరంగా వుంటోంది. ప్రస్తుతం ఆంధ్ర లో ప్రశాంత వాతావరణమే వుంది.
నిత్యావసరాల కోసం సడలించి, సరిపడా వేళలు అమలు చేస్తున్నారు. అలాగే కూరగాయల మార్కెట్ లను వికేంద్రీకరించడంతో బాటు, సువిశాల ప్రాంగణాలలోకి మార్చారు. సరుకుల కొరత కొంత వుంది కానీ మరీ భయంకరంగా కాదు. నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఆంధ్రకు రావాలనుకున్నవారి విషయంలో కాస్త అలజడి చెలరేగింది. తరువాత అది కూడా సర్దుబాటు అయింది.
ఈ నేపథ్యంలో సిఎమ్ జగన్ మీడియాతో మాట్లాడబోతున్నారు అంటే ఏమై వుంటుంది అన్నది కాస్త ఆసక్తి. బహుశా సరుకులు అందుబాటులోకి రావడం గురించి, అలాగే ధరల నియంత్రణ గురించి, రోజు వారీ కార్మికులను ఆదుకోవడం గురించి జగన్ కొన్ని ప్రకటనలు చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
అదే విధంగా అంతర్ జిల్లాల ప్రయాణం, తెలంగాణ నుంచి ఆంధ్రలోకి రావడం వంటి విషయాలపై కొన్ని విధి విధానాలు ప్రకటించే అవకాశం కూడా వుందని తెలుస్తోంది.