వైఎస్సార్ కట్టించిన విమ్స్ ఇపుడు పనికొచ్చింది!

వైఎస్సార్ సీఎంగా ఉండగా విశాఖ నగర అభివ్రుధ్ధి కోసం సమగ్రమైన ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఆయన హయాంలోనే విశాఖ కార్పోరేషన్ జీవీఎంసీ స్థాయికి చేరుకుంది. అలాగే విశాఖకు ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా జరిగింది.…

వైఎస్సార్ సీఎంగా ఉండగా విశాఖ నగర అభివ్రుధ్ధి కోసం సమగ్రమైన ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఆయన హయాంలోనే విశాఖ కార్పోరేషన్ జీవీఎంసీ స్థాయికి చేరుకుంది. అలాగే విశాఖకు ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా జరిగింది.

ఇక విశాఖ భవిష్యత్తు మహా నగరం అని  నాడే ఊహించి మెట్రో రైలు ప్రతిపాదనలు కూడా నాడు వైఎస్సార్ తయారు చేశారు. ఇక విశాఖలో ఐటీ హబ్ కూడా ఆయన పాలనలోనే వచ్చింది. చుట్టుపక్కల సెజ్ లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్రా, అటు ఒడిషా ప్రజలకు కూడా ఉపయోగంగా ఉండేలా నిమ్స్ తరహాలో విమ్స్  ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడంతో అది అతి సాధారణ ఆసుపత్రిగా మారింది.

ఇపుడు అదే విమ్స్  కరోనా వైరస్ బారిన పడిన వారికి పనికివస్తోంది. క్వారంటైన్స్ వార్డులు అక్కడే ఏర్పాటు చేసి  వైద్యం అందిస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్ అప్పట్లో చూపిన చొరవ వల్ల ఇపుడు విశాఖలో అతి విశాలమైన పడకలతో ఒక వైద్య సదుపాయం లభించింది అని ప్రజలు  అంటున్నారు.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

కత్రినా కష్టాలు