కరోనా విపత్కాలంలో కరోనా బాధితులకు చేతనైన రీతిలో సాయం చేసే మనసులు ముందుకొస్తున్నాయి. ఎలాంటి ప్రచారానికి నోచుకోకుండానే అవసరంలో ఉన్న వారిని అదుకుంటున్న మనుషులను చూస్తే ఆనందం కలుగుతోంది. ఈ నేపథ్యంలో శృంగార తార షకీలా సామాజిక సేవా కార్యక్రమాలను తలపెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
లాక్డౌన్ కారణంగా ఆకలితో రోడ్డు పక్కన తిరుగుతున్న నిరుపేదల కడుపు నింపుతుండటం గమనార్హం. ఇందుకు సంబంధించి ఫొటోలను షకీలా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక సందేశాన్ని కూడా ఇచ్చారు.
రెండు చేతుల్లో ఒక చేతిని మీ కోసం, మరో చేతిని ఇతరులకు సాయం అందించడానికి ఉపయోగిస్తూ, పేదలకు ఆపన్నహస్తం అందించాలని కోరారు. షకీలాను ఇంతకాలం మనం హాట్ యాంగిల్లోనే చూశాం. కానీ ఆమెలో హ్యూమన్యాంగిల్ ఉందనే విషయం ఇప్పుడే బయట పడింది.
పేదల ఆకలి తీర్చడం అనేది సేవలన్నింటిలోకెల్లా గొప్పది. ఆకలిగొన్న వాళ్లకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అలాగే కడుపు నింపుకున్న ఆ క్షణం కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. పది మంది ఆకలి తీర్చిన షకీలా ప్రశంసలు అందుకుంటోంది.