జగన్ ఆలోచన ఇప్పుడు అద్భుతంగా కలిసొచ్చింది

దేశవ్యాప్తంగా కరోనా కేసులు 606కు చేరుకున్నాయి. పాతిక రాష్ట్రాలకు సగటున లెక్కేసినా 24 కేసులు దాటినట్టే. కానీ ఏపీలో మాత్రం కేసుల సంఖ్య తక్కువే. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో 19 కేసులు లెక్కతేలాయి. వీరిలో…

దేశవ్యాప్తంగా కరోనా కేసులు 606కు చేరుకున్నాయి. పాతిక రాష్ట్రాలకు సగటున లెక్కేసినా 24 కేసులు దాటినట్టే. కానీ ఏపీలో మాత్రం కేసుల సంఖ్య తక్కువే. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో 19 కేసులు లెక్కతేలాయి. వీరిలో ఒకరికి వ్యాధి నయం కావడంతో ఇంటికి పంపించేశారు. కర్నాటకలో ఏకంగా 44 కేసులు, ఒకరు చనిపోయిన భయానక పరిస్థితి అక్కడుంది. తెలంగాణలో 41 కేసులున్నాయి. వీటన్నిటితో పోల్చి చూస్తే ఏపీలో నమోదవుతున్న కరోనా కేసులు తక్కువే. ఇప్పటికే ఒకరు డిశ్చార్జి కాగా, మిగతావాళ్లంతా సేఫ్ అంటున్నారు వైద్యులు.

మరో సరిహద్దు రాష్ట్రం ఒడిశాలో కేవలం రెండు కేసులే నమోదయ్యాయి. ఏపీతో పాటు.. అతికొద్ది రాష్ట్రాల్లో మాత్రమే పరిస్థితి కంట్రోల్ లో ఉంది. ఇదంతా కేవలం సర్కారు గొప్పతనం అని చెప్పుకుంటే అతిశయోక్తి అవుతుంది కానీ, జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు తోడు.. అధికారుల చొరవ, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అంతా కలసి కరోనా కట్టడికి కంకణం కట్టుకున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు. జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ.. ఈ కరోనా టైమ్స్ లో ప్రభుత్వానికి అద్భుతంగా కలిసొచ్చింది.

విదేశాల నుంచి వచ్చినవారి వివరాలన్నీ పక్కాగా సేకరించడంతో పాటు, వారిని పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయడంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్యశాఖ అధికారులు సఫలమయ్యారు. ఎక్కడి నుంచో వచ్చిన అధికారులు జాగ్రత్తలు చెబితే.. పెద్దగా పట్టించుకోరు. కానీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అదే ఊరిలో ఉండేవారు కాబట్టి ఇక్కడ ఫలితం కనిపించింది..

ఎక్కడికక్కడ వాలంటీర్లు గ్రామ పోలీసుల్లాగా పహారా కాస్తున్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చినవారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారిని కూడా బైటకు రానీయడం లేదు. దీంతో ఏపీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్టేనని తెలుస్తోంది.

కరోనాపై ప్రభుత్వం ఈ రేంజ్ లో పకడ్బందీగా చర్యలు చేపట్టగలిగిందంటే దానికి కారణం ముందుచూపుతో జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ. జగన్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికే అద్భుత ఫలితాలనిచ్చింది. ఇప్పుడీ కరోనా టైమ్ లో ఈ వ్యవస్థ మరోసారి చక్కగా పనిచేసి, దేశానికే ఆదర్శంగా నిలిచింది.

కత్రినా కష్టాలు

స్కూటర్ మీద రౌండేసిన తణుకు ఎమ్మెల్యే