కొలిక్కి వచ్చిన ఏపీ-తెలంగాణ ‘కరోనా’ వివాదం

హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్స్, పీజీ మెస్సులను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయించడంతో ఒక్కసారికి ఏపీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన అనుమతి పాసులతో సొంతూళ్లకు ప్రయాణమైన వీళ్లకు…

హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్స్, పీజీ మెస్సులను తెలంగాణ ప్రభుత్వం ఖాళీ చేయించడంతో ఒక్కసారికి ఏపీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన అనుమతి పాసులతో సొంతూళ్లకు ప్రయాణమైన వీళ్లకు ఏపీ-తెలంగాణ బోర్డర్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాత్రంతా నడిచిన హైడ్రామా ఎట్టకేలకు సుఖాంతమైంది.

హైదరాబాద్ లో హాస్టళ్లు, పీజీ మెస్సులు తెరిచే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో జగ్గయ్యపేట వద్ద లాక్ అయిన వందలాది మంది విద్యార్థులు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. అయితే బోర్డర్ వద్ద ఆగిపోయిన కొంతమందిని క్వారంటైన్ కండిషన్ మీద ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతించింది.

2 వారాల పాటు క్వారంటైన్ లో ఉండడానికి అంగీకరించిన 44 మంది విద్యార్థుల్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతించింది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వాళ్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. తూర్పోగోదావరి జిల్లా వాసుల్ని రాజమండ్రికి, పశ్చిమ గోదావరి జిల్లా వాసుల్ని భీమవరం, తాడేపల్లిగూడెం క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. క్వారంటైన్ కు అంగీకరించిన విద్యార్థులు, ఉద్యోగులంతా తిరిగి హైదరాబాద్ లోని తమ హాస్టళ్లకు పయనమయ్యారు.

లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ప్రోటోకాల్ ప్రకారమే విద్యార్థుల్ని రాష్ట్రంలోకి అనుమతించలేదని పోలీసులు స్పష్టంచేశారు. జరిగిన ఘటనపై ఏపీ, తెలంగామ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఇకపై ఎవరికీ ప్రత్యేక అనుమతులు ఇవ్వమని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. అటు ఏపీ పోలీసులు కూడా ఇకపై ఎవ్వర్నీ రాష్ట్రంలోకి అనుమతించమని స్పష్టంచేశారు. దీంతో రాత్రంతా నడిచిన హైడ్రామాకు తెరపడింది.

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

కత్రినా కష్టాలు