మొనగాడు మోడీ.. సోషల్ మీడియాలో జేజేలు

కరోనాపై సమరంలో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు.. ప్రకటించడమే కాదు, వాటిని ధైర్యంగా అమలు చేయడంలో కూడా ప్రధాని మోదీ గట్స్ కనపడుతున్నాయి. ఈ సమయంలో మోదీ కాకుండా ఇంకెవరైనా ప్రధాని స్థానంలో ఉంటే,…

కరోనాపై సమరంలో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు.. ప్రకటించడమే కాదు, వాటిని ధైర్యంగా అమలు చేయడంలో కూడా ప్రధాని మోదీ గట్స్ కనపడుతున్నాయి. ఈ సమయంలో మోదీ కాకుండా ఇంకెవరైనా ప్రధాని స్థానంలో ఉంటే, ఇలాంటి కట్టడి చర్యలు సాధ్యమయ్యేవా అని అంటున్నారు చాలామంది నెజిటన్లు. దేశం మొత్తం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మోదీ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడం, దాన్ని విడగొట్టడం, పౌరసత్వ సవరణ చట్టంపై పట్టుబట్టి ఉండటం.. ఇలా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు చాలానే ఉన్నాయి. బాబ్రీ మసీదు స్థల వివాదానికి సంబంధించిన తీర్పు వచ్చిన సమయంలో దేశంలో ఎక్కడా అల్లర్లు జరక్కుండా అణచివేసిన ఘనత కూడా మోదీ-అమిత్ షా ద్వయానిదే.

అలాంటి మొండివాడు కాబట్టే.. ఇలాంటి విపత్తు సమయంలో అంతకంటే మొండిగా వ్యవహరించారు. ఒక రోజు జనతా కర్ఫ్యూకి జనాల్ని సిద్ధం చేసి, పరిస్థితి చేయిదాటుతుందనుకుంటున్న టైమ్ లో ఏకంగా 21రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. అమెరికా సైతం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడానికి వెనకాడుతున్న టైమ్ లో మోదీ తీసుకున్న నిర్ణయం నిజంగా గొప్పదే.

ప్రతిపక్షాలు కూడా ఇక్కడ రాజకీయం చేయడానికి ఏమీ లేదు, అసలు కామెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. విపత్తు విషయంలో ఇంత త్వరగా, ఇంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మోదీకి మాత్రమే సాధ్యమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమో, మన్మోహన్ వంటి ప్రధాని ఉండి ఉంటే.. కరోనాపై యుద్ధాన్ని ఇంత త్వరగా ప్రారంభించేవారు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

లాక్ డౌన్ సమయంలో వ్యాపార, ప్రజా వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిలను తట్టుకోవాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఆ గట్స్ ఉన్నాయి కాబట్టే మోదీ యుద్ధం మొదలుపెట్టారు. ప్రజలంతా సైనికులై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్థిక నష్టాలు, కష్టాల సంగతి తర్వాత.. ముందు ప్రజలు ప్రాణాలతో ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్లారు.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్