షాకింగ్.. హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్

మొన్నటివరకు ఛారిటీ కార్యక్రమాల్లో ఉంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం ఫండ్ రైజింగ్ కూడా మొదలుపెట్టింది. ఎప్పట్లానే అన్నార్తులకు ఆహారం కూడా అందిస్తూ వచ్చింది. ఇలా బిజీ బిజీగా గడుపుతున్న ప్రణీత, సడెన్ షాకిచ్చింది. ఆమె…

మొన్నటివరకు ఛారిటీ కార్యక్రమాల్లో ఉంది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం ఫండ్ రైజింగ్ కూడా మొదలుపెట్టింది. ఎప్పట్లానే అన్నార్తులకు ఆహారం కూడా అందిస్తూ వచ్చింది. ఇలా బిజీ బిజీగా గడుపుతున్న ప్రణీత, సడెన్ షాకిచ్చింది. ఆమె పెళ్లి చేసుకుంది.

అవును.. నిన్న ప్రణీత వివాహం సింపుల్ అండ్ సీక్రెట్ గా జరిగిపోయింది. వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకుంది. కేవలం ఓ 10 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఫొటోలు చూస్తే, పెళ్లి కూడా సింపుల్ గా ఏదో తోటలో జరిపించినట్టున్నారు.

ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా, సీక్రెట్ గా ఇలా పెళ్లి చేసుకోవడంపై ప్రణీత క్షమాపణలు కోరింది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల వల్ల తమ పెళ్లికి అనుమతి వస్తుందా రాదా అనే సందిగ్దతలో కుటుంబ సభ్యులమంతా ఉండిపోయామని, సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందు మాత్రమే తమకు అనుమతి లభించడంతో హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ప్రణీత.

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రణీత. కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం లాంటి సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ రోల్స్ పోషించింది. తాజాగా ఈమె బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఒకేసారి 2 సినిమాలు చేస్తోంది.