మెగాస్టార్ చిరంజీవి ప్రకటించినట్టుగానే ఉగాదికి సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాడు. చిరంజీవి కొణిదెల పేరుతో ట్విటర్ ఖాతా తెరిచాడు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అభిమానులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నాడు. తెలుగు ప్రజలకు శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు.
అందరికీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. నాతోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసి కట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం…సురక్షితంగా ఉందాం అని తన మొదటి ట్వీట్‌ను ఒక మంచి సందేశంతో స్వీట్ ట్వీట్‌గా మలిచాడు.
“మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఆయన ట్విటర్ ఖాతాను తెరిచారు. చిరంజీవి కొణిదెల పేరుతో అకౌంట్‌ను ప్రారంభించిన ఆయన.. అభిమానులతో మాట్లాడటం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది రోజున ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామ”ని ఆయన పిలుపునిచ్చాడు.
కరోనా వైరస్ (కోవిడ్-19)ను అరికట్టడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు ప్రజలందరిని ఇళ్లలోనే ఉండమని ఇచ్చిన ఆదేశానికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా మద్దతు తెలిపాడు. భవిష్యత్‌లో సామాజిక అంశాలపై చిరంజీవి నుంచి మెరుగైన సందేశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.