అల్లు అరవింద్ ఓ సినిమాను అక్కినేని అఖిల్ తో చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆస్థానంలో ఇద్దరు దర్శకులు కథలతో రెడీగా వున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, గీతగోవిందం పరుశురామ్. ఈ ఇద్దరినీ ఇప్పుడు అఖిల్ కు కథలు చెప్పమని అరివింద్ పురమాయించారు.
ఇప్పుడు ఈ రెండు కథల్లో అఖిల్ కు ఏది నచ్చితే ఆ డైరక్టర్ తో సినిమా వుంటుంది. అయితే వీలయినంత వరకు పరుశుమార్ తో సినిమా వుండే అవకాశమే ఎక్కువ వున్నట్లు టాక్. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ ఎంత గొప్ప కథ తెచ్చినా కాంబినేషన్ కు క్రేజ్ వుండదు.
మజ్ఞు సినిమాకు అంతంత మాత్రం ఓపెనింగ్స్ దక్కాయి. అక్కడ హిట్ డైరక్టర్ వున్నా కూడా, సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, మూడురోజుల తరువాత అఖిల్ పుల్ చేయలేకపోయారు. అలాంటప్పుడు ఎప్పుడో సినిమా చేసి, ఏళ్లకాలంగా ఖాళీగా వున్న బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా అంటే ఎలా వుంటుంది? అంతకన్నా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన పరుశురామ్ అంటే బెటర్ కదా?
ఇదిలావుంటే, గీతగోవిందం లాంటి హిట్ ఇచ్చిన తరువాత బయటకు వెళ్లకుండా, గీతాలోనే వుండేలా చేసి, ఇప్పుడు అఖిల్ లాంటి బడ్డీ హీరోతో సినిమా చేయమనడం పట్ల దర్శకుడు పరుశురామ్ కాస్త అసంతృప్తిగా వున్నారని బోగట్టా. గీతగోవింద్ హిట్ అయిన తరువాత పరుశురామ్ పేరుతో అనేక టాప్ హీరోల పేర్లు జతకట్ట వినిపించాయి. కానీ ఇప్పుడు అవేవీ లేదు. జస్ట్ మూడు ఫ్లాపుల అఖిల్ తప్ప.
అదే ఎఫ్ 2 లాంటి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి డైరక్ట్ గా మహేష్ రేంజ్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు అఖిల్ తో సినిమా చేసి, బ్లాక్ బస్టర్ చేస్తే తప్ప పరుశురామ్ ఇజ్జత్ నిలబడదు. అది అంత సులువైన ఫీట్ అయితే కాదు.