అదిగో సినిమా.. ఇదిగో కాస్టింగ్

వార్తలు వేరు గ్యాసిప్ లు వేరు. ప్రింట్ మీడియాలో వార్తలు వుంటే, వెబ్ మీడియాలో వార్తలతో పాటు గ్యాసిప్ లు కూడా వుండడం కామన్. అయితే ఇప్పడు ప్రింట్ మీడియా కూడా గ్యాసిప్ లకు…

వార్తలు వేరు గ్యాసిప్ లు వేరు. ప్రింట్ మీడియాలో వార్తలు వుంటే, వెబ్ మీడియాలో వార్తలతో పాటు గ్యాసిప్ లు కూడా వుండడం కామన్. అయితే ఇప్పడు ప్రింట్ మీడియా కూడా గ్యాసిప్ లకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే జనాలు గ్యాసిప్ లకు, ఎక్స్ క్లూజిక్ వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసి, కొత్త తరహా వార్తలు పుట్టించే వ్యవహారం స్టార్ట్ అయింది.

ఇదెలా వుంటుంది అంటే, ఓ దర్శకుడు ఎప్పుడూ ఓ నటుడినో? నటినో రిపీట్ గా పెడుతూ వుంటే, అతగాడి ప్రాజెక్టులో వుంటున్నారంటూ రాసేయడం. అంటే డైరక్టర్, హీరోల సినిమాలను ట్రాక్ చేస్తూ, ఊహాగానాలు చేయడం అన్నమాట. వాస్తవానికి ఇవ్వాళ రాసే గ్యాసిప్ రేపటికో మర్నాటికో నిజమైతే క్రెడిబులిటీ వుంటుంది. లేకుంటే వట్టి గ్యాసిప్ గా మిగిలిపోతుంది.

జనాలు ఈ రోజు చదివి రేపు మరిచిపోతారు అన్న పాయింట్ బేస్ చేసుకుని, ఈ తరహా కథనాలు అన్నమాట. ఈ రోజుకు మనం మాత్రమే ఈ వార్త ఇచ్చామా లేదా అన్న సంతృప్తి తప్ప, వార్తలో వన్ పర్సంట్ నిజం వుండదు. ఇటీవల త్రివిక్రమ్-బన్నీ సినిమాలో నదియా నటిస్తుందని, అలాగే బోమన్ ఇరానీ కూడా వుంటారని వార్తలు అల్లేసారు.

కానీ వాస్తవం ఏమిటంటే, ఈ ఇద్దరి పేర్ల గురించిన ఆలోచన దర్శకుడు త్రివిక్రమ్ మదిలో కూడా లేదని. అస్సలు ఆ ఇద్దరు ఈ సినిమాలో వుండరన్నది పక్కా అని, యూనిట్ వర్గాలే క్లియర్ గా చెబుతున్నాయి. కానీ త్రివిక్రమ్ కదా వాళ్లు వుంటారులే అని ఫిక్స్ అయిపోయినట్లున్నారు.

ఓ సీనియర్ నటి అయితే వుండే అవకాశం వుంది కానీ నదియా మాత్రం కానే కాదు అన్నది తెలుస్తున్న విషయం. అలాగే బోమన్ ఇరానీ వుండే చాన్సే లేదు అన్నది మరో పాయింట్. అన్నట్లు బ్రహ్మానందం, హేమల గురించి కూడా  ఊహించేసారు. వాటి మీద కూడా క్లారిటీ రావాల్సి వుంది.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!