దక్షిణాది చిత్రపరిశ్రమలో సీనియర్ నటుడు వీకే నరేశ్, రమ్య, పవిత్ర లోకేశ్ మధ్య వైవాహిక వ్యవహార బంధం తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరతో నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకుంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తనకు విడాకులే ఇవ్వకుండా మరో మహిళతో కాపురం ఎలా చేస్తావని నరేశ్ మూడో భార్య రమ్య ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో పవిత్ర ఇప్పటికీ తన భార్యే అని భర్త సుచింద్రప్రసాద్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
భార్యకు విడాకులు ఇవ్వకుండా నరేశ్, అలాగే భర్తతో చట్టప్రకారం తెగతెంపులు చేసుకోకుండా పవిత్ర లోకేశ్ …ఇలా ఇరువురు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పవిత్ర భర్త సుచింద్రప్రసాద్ మాత్రం నరేశ్ ఎవరో తనకు తెలియదని, తన భార్యతో సంబంధాలపై మీడియా, కొంత మంది మిత్రుల ద్వారా తెలుసుకున్నానని అంటున్నారు.
నరేశ్‌తో పవిత్ర బంధం తీవ్ర వివాదమైన నేపథ్యంలో ఆమె భర్త మీడియాతో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. 16 ఏళ్ల క్రితం తాము హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులైనట్టు సుచింద్రప్రసాద్ తెలిపారు. తామిద్దరం దంపతులమని రుజువు చేసే ఆధారాలున్నాయన్నారు. తన పాస్‌పోర్టులో భార్యగా పవిత్ర, అలాగే ఆమె పాస్‌పోర్టులో భర్తగా తన పేరు నమోదైనట్టు ఆయన చెప్పారు.
అంతేకాదు, ఆధార్‌కార్డులో కూడా భార్యభర్తలుగా నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకంగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారన్నారు. ఆదర్శదంపతులుగానే ఉన్నామని చెప్పడం గమనార్హం. పవిత్రపై తనకు ఇప్పటికీ గౌరవం వుందన్నారు. ఈ పరిణామాల వెనుక ఎవరో ఉన్నట్టు ఆయన అనుమానించారు. పవిత్రను ఉద్దేశించి తాను ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనతో పెళ్లి జరగలేదని, కేవలం సహజీవనం చేశామని, ఆ తర్వాత విడిపోయామని పవిత్ర ఎందుకు చెప్పారో అర్థం కావడం లేదన్నారు.
తాను సంప్రదాయవాదినని, సహజీవన విధానంపై నమ్మకాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తామిద్దరం గత 16 సంవత్స రాలుగా భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్న సంగతి కర్ణాటక ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం పవిత్ర కలిసి వుంటున్న నరేశ్ ఎవరో, ఆయనతో ఆమెకున్న సంబంధాల గురించి నిజంగానే తనకు తెలియదని సుచింద్రప్రసాద్ చెప్పడం చర్చనీయాంశమైంది.