కరోనా ఎఫెక్ట్.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

కరోనా ప్రభావంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్ని పూర్తిగా పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో బడ్జెట్…

కరోనా ప్రభావంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్ని పూర్తిగా పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో బడ్జెట్ సమావేశాలు కాకుండా.. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు దానిని కూడా రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బడ్జెట్ సమావేశాలు పెడితే మరోసారి అధికారులు, ప్రజాప్రతినిధులు, వాళ్లతో పాటు కారు డ్రైవర్లు, భద్రతా సిబ్బంది బయటకు రావాల్సిందే. ఇలాంటి టైమ్ లో అంతా బయటకొచ్చి సమావేశాలు పెడితే అది క్వారంటైన్ స్ఫూర్తికే విరుద్ధం. అందుకే పూర్తిగా సమావేశాల్ని రద్దుచేసే ఆలోచనలో ఉన్నారు జగన్. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానుంది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో ట్రెజరీ నుంచి నిధులు వాడుకోవాలంటే బడ్జెట్ సమావేశాలు పెట్టాలి. నిధుల కేటాయింపు జరగాలి. కుదరని పక్షంలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ అయినా ఉండాలి. ఈ రెండూ లేకుండా కార్యకలాపాలు సాగించలేం. ఇలాంటి టైమ్ లోనే ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ను తీసుకొస్తుంటాయి. ఈసారి జగన్ కూడా బడ్జెట్ పై అలాంటి ఆర్డినెన్స్ నే తీసుకురావాలని భావిస్తున్నారు.

గతంలో రెండు సార్లు ఆర్డినెన్స్ ద్వారానే ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను తీసుకొచ్చారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు, 2014లో రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు 2020లో కూడా మరోసారి ఆర్డినెస్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్