Advertisement

Advertisement


Home > Movies - Movie News

నీరు-నిప్పు కాన్సెప్ట్ తో వచ్చిన ఆర్ఆర్ఆర్

నీరు-నిప్పు కాన్సెప్ట్ తో వచ్చిన ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ టైటిల్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే వెల్లడించింది. చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పదాల్నే ఏర్చికూర్చి ఆర్ఆర్ఆర్ టైటిల్ కింద మార్చారు. ఇటు తెలుగు, అటు ఇంగ్లిష్ లో కూడా ఇన్నాళ్లూ మనం విన్న పదాలే దొర్లాయి. మొత్తానికి సినిమా స్టార్ట్ అయిన ఏడాదికి టైటిల్ పై క్లారిటీ అయితే వచ్చేసింది.

ఇక మోషన్ పోస్టర్ విషయానికొస్తే.. నీరు-నిప్పు కాన్సెప్ట్ తో ఈ మోషన్ పోస్టర్ ను రివీల్ చేశాడు రాజమౌళి. గతంలో బాహుబలి సినిమాకు ఎలాగైతే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడో, ఈసారి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల కోసం కూడా ఇలాంటి కాన్సెప్ట్ నే సెలక్ట్ చేసుకున్నాడు.

రామ్ చరణ్ ను ఫైర్ బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ ను వాటర్ బ్యాక్ డ్రాప్ లో చూపించాడు. తిరుగులేని ఈ రెండు శక్తులు చేతులు కలిపితే ఎలా ఉంటుందో అదే ఆర్ఆర్ఆర్ సినిమా అంటూ మోషన్ పోస్టర్ లో తేల్చేశాడు జక్కన్న. చూస్తుంటే.. ఈ కాన్సెప్ట్ కు సినిమాలో పాత్రలకు ఏదో సంబంధం ఉన్నట్టే ఉంది. లేకపోతే రాజమౌళి టైటిల్ ను ఇలా ప్రజెంట్ చేయడు కదా.

ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఈ మోషన్ పోస్టర్ కు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. వీళ్లిద్దరి కాంబోలో మర మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అనే విధంగా ఉంది ఈ స్కోర్. ఈ వివరాలతో పాటు సినిమాకు సంబంధించి 2 విషయాలపై కూడా ఆర్ఆర్ఆర్ ఈరోజు క్లారిటీ ఇచ్చింది.

స్వతంత్రానికి ముందు 1920వ సంవత్సరంలో జరిగిన ఫిక్షన్ కథగా ఆర్ఆర్ఆర్ రాబోతోందనే విషయాన్ని టైటిల్ లో చెప్పారు. దీంతో పాటు రిలీజ్ డేట్ పై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్నామంటూ మోషన్ పోస్టర్ లో ప్రకటించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?