విశాఖ అంతర్జాతీయ నగరం. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం నివాసం ఉంటారు. అలాగే విమానాశ్రయం ఉండడంతో విదేశాల నుంచి వచ్చే వారి తాకిడి ఎక్కువగా ఉంటుంది. దాంతో కరోనా కారియర్స్ ఎక్కువగా ఉన్నారు.
దాని కారణంగా విశాఖలో ఇపుడు కరోనా అనుమానిత కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీన్ని ద్రుష్టిలో ఉంచుకే కేంద్రం విశాఖ జిల్లాను మొదట లాక్ డౌన్ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్షించి విశాఖలో మూడు ప్రాంతాలు హై రిస్క్ జోన్లుగా వెల్లడించింది.
విశాఖ సిటీలో సీతమ్మధార, పారిశ్రామికవాడ గాజువాక, రూరల్ జిల్లా అనకాపల్లిల్లో కరోనా అనుమానిత కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విదేశాల నుంచి వేలల్లోనే విశాఖకు తిరిగి వచ్చిన వారు ఉన్నారు. వారి వల్ల ఇతరులకు కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో అతి పెద్ద నగరం విశాఖ ఇపుడు కరోనా నేపధ్యంలో మొత్తం అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది.