రామ్ వారియర్ ట్రయిలర్ వచ్చింది. లింగుస్వామి డైరక్షన్ లోని వారియర్ ట్రయిలర్ మీద టాలీవుడ్ లో ఒకటే కంప్లయింట్ వినిపిస్తోంది. ట్రయిలర్ కు ఇచ్చిన ఆర్ఆర్ అస్సలు బాలేదని. దేవీ ఈ మధ్యన ఎవ్వరికీ సరైన మ్యూజిక్ ఇవ్వడం లేదన్నది వాస్తవం. ఉప్పెన సినిమా తరువాత దేవీ నుంచి మంచి వర్క్ ఏదీ రాలేదు. లక్కీగా వారియర్ సినిమాకు రెండు పాటలు మంచివే ఇచ్చాడు. అంతవరకు బాగానే వుంది
కానీ ట్రయిలర్ లో ఆర్ఆర్ మాత్రం అప్ టు ది మార్క్ లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే కామెంట్లు వినిపిస్తున్నాయి. లింగుస్వామి, రామ్ గట్టిగా పట్టుకోకపోతే దేవీ ఆర్ఆర్ ను సరిగ్గా ఇవ్వకుంటే చాలా ప్రమాదం అవుతుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా కాబట్టి ఆర్ఆర్ చాలా కీలకం.
దేవీ ఎందుకు ఇలా చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. కేవలం సుకుమార్ కు మాత్రమే మంచి ఆల్బమ్, ఆర్ఆర్ ఇచ్చే ఉద్దేశం వుంటే కీరవాణి మాదిరిగా ఒక్కరికే ఫిక్స్ అయిపోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిర్మాత దిల్ రాజు కోరి మంచి పాటల కోసం తన సోదరుడి తనయుడి ప్రాజెక్టు అప్పగిస్తే అది కూడా అలాగే చేసాడని కామెంట్లు వున్నాయి. ఇప్పటి వరకు దేవీ నే నమ్ముకున్న అనిల్ రావిపూడి తను బాలయ్యతో చేసే సినిమాకు థమన్ దగ్గరకు వెళ్తున్నాడని వార్తలు వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో దేవీ తన వర్క్ మీద మరింత శ్రద్ద పెట్టాల్సి వుంది. ముఖ్యంగా వారియర్ ఆర్ఆర్ విషయంలో రామ్, లింగుస్వామి చాలా కేర్ తీసుకోవాలి. ట్రయిలర్ లో మాదిరిగా వుంటే సినిమాకు మైనస్ అవుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.