సినిమా తర్వాత రకుల్ కు ఇదే ప్రాణం

“నాకు సినిమాలే ప్రాణం” ఏ హీరోయిన్ ను అడిగినా వచ్చే సమాధానం ఇదే. రకుల్ కూడా ఇదే చెప్పింది కాబట్టి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి సినిమాల తర్వాత రకుల్ కు ఇష్టమైనది…

“నాకు సినిమాలే ప్రాణం” ఏ హీరోయిన్ ను అడిగినా వచ్చే సమాధానం ఇదే. రకుల్ కూడా ఇదే చెప్పింది కాబట్టి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి సినిమాల తర్వాత రకుల్ కు ఇష్టమైనది ఏది. ఈ విషయం కూడా చాలామందికి తెలుసు. ఆమెకు ఇష్టమైన వ్యాపకం వ్యాయామం. ప్రతి రోజూ ఆమె జిమ్ చేస్తుంది. అయితే ఈ రెండూ కాకుండా రకుల్ కు ప్రాణప్రదమైంది ఒకటి ఉంది. అదే గోల్ఫ్.

అవును.. రకుల్ కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా గోల్ఫ్ ఆడేది రకుల్. ఫ్రీ టైమ్ దొరికితే సోదరుడు అమన్ ప్రీత్ తో కలిసి గోల్ఫ్ ఆడేది. అలా 14 ఏళ్లకే జూనియర్స్ విభాగంలో నేషనల్ లెవెల్ లో విన్నర్ గా కూడా నిలిచింది ఈ బ్యూటీ.

అయితే ఎప్పుడైతే గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చిందో అప్పట్నుంచి తనకు ఎంతో ఇష్టమైన గోల్ఫ్ కు దాదాపు దూరమైపోయానని చెప్పుకొచ్చింది రకుల్. బహుశా తను వినోద రంగంలో స్థిరపడకపోయి ఉంటే… జిమ్-గోల్ఫ్ రంగాల్లో సెటిల్ అయ్యేదాన్నని చెప్పుకొచ్చింది.

ఇప్పటికీ రకుల్ గోల్ఫ్ ఆడుతుంది. కనీసం 2-3 నెలలకు ఒకసారైనా గోల్ఫ్ కోర్స్ లో గడపకపోతే ఆమెకు ఏదోలా ఉంటుంది. ఇక గోల్ఫ్ కు సంబంధించి కపిల్ దేవ్ తో గోల్ఫ్ ఆడిన సందర్భం తనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చింది.