తనకు, నటుడు నరేశ్‌కు మధ్య సంబంధంపై రమ్య రఘుపతి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని నటి పవిత్ర లోకేశ్ వాపోయారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవిత్ర ఏమన్నారంటే…
“నేను కర్నాటక నుంచే టాలీవుడ్‌కు వచ్చాను. చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తున్నాను. మీ అందరికి దగ్గరయ్యాను. నా సమస్యను మీతో పంచుకోవాలని ఈ వీడియో విడుదల చేస్తున్నా. నటుడు నరేశ్ గురించి మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేశ్ భార్య అని చెప్పి రమ్య అనే మహిళ బెంగళూరు వచ్చి నా గురించి చెడ్డగా మాట్లాడింది.
నరేశ్ దంపతులు విడాకులకు నేనే కారణమని, రిలేషన్‌షిప్‌లో ఉన్నామని బెంగళూరు మీడియాకి రమ్య చెప్పింది. నన్ను టార్గెట్ చేసి… బాధితురాలిని చేసింది. ఇది మనసును నొప్పించింది.
చాలా బాధ పడే విషయం. రమ్య చెప్పినట్టు ఏమీ లేదని ప్రజలకి చెప్పాలనిపించింది. భర్త కావాలని అనుకుంటే, కుటుంబంలో సెట్ చేసుకోవాలి. తెలుగులో నరేష్ ఫేమస్ యాక్టర్. ఆయన భార్య అంటూ బెంగళూరుకు వచ్చి ఎందుకు చెబుతోంది? రమ్యకు ఏదైనా సమస్య వుంటే హైదరాబాద్‌లో కదా చెప్పాల్సింది. కానీ బెంగళూరుకు వచ్చి నన్ను చాలా చెడ్డగా చిత్రీకరించింది. ఇది సరైంది కాదు. నాకు, నరేష్‌కు అందరూ మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా” అని పవిత్ర లోకేశ్ వేడుకున్నారు.
పవిత్ర తండ్రి మైసూర్ లోకేశ్ కన్నడంలో నటుడు. లోకేశ్ కుమార్తె పవిత్ర 16 ఏళ్లలో చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారు. ఆమె కన్నడతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. పవిత్రకు సుచేంద్ర ప్రసాద్‌తో వివాహమైంది. పవిత్ర భర్త కూడా నటుడు. భర్తతో విభేదాలున్నట్టు చర్చ జరుగుతోంది.
నరేశ్‌తో పవిత్ర రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఆయన మూడో భార్య రమ్య ఆరోపిస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రతో ఎలా కలిసి వుంటారని రమ్య ప్రశ్నిస్తున్నారు. రమ్య ఆరోపణలను పవిత్ర ఖండిస్తున్నారు. మరోవైపు పవిత్రపై భర్త సుచేంద్ర ప్రసాద్ విమర్శలు చేయడం గమనార్హం.