సినిమాకు జనం రావాలంటే ఒకటో రెండు పాటలు బాగుండాలి. అందులోనూ ఒక పాటలో అయినా ఏదో ఒక హుక్ లైన్ పట్టుకోవాలి. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సరే.
కెకె రాధామోహన్ నిర్మాణంలో ఆది సాయికుమార్ చేస్తున్న సినిమా క్రేజీ ఫెలో. ఈ సినిమాలో పాటల మీద గట్టి దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓ మెలోడీ, మరో పాట విడుదల చేసారు. పాజిటివ్ టాక్ నే వచ్చింది. ఇప్పుడు ఆల్బమ్ లో మూడో పాట కింద మాస్ బీట్ విడుదల చేసారు.
‘బాలా త్రిపుర సుందరి..చాలా నచ్చిందే ఎందుకోమరి..’ అంటూ సాగిందీ పెప్పీ నెంబర్. కాసర్ల శ్యామ్ రాసిన గీతాన్ని సాకేత్ కొమండూరి ఆలపించారు.ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు. ఆది సాయికుమార్ అండ్ టీమ్ మీద ఈ డ్యాన్స్ నంబర్ ను చిత్రీకరించారు.
ఈ సినిమాలో ఆది సాయికుమార్ తో పాటు, దివ్యాంగన సూర్యవంశీ, మీర్నా మీనన్, సప్తగిరి, తదితరులు నటించారు. ఈ సినిమాకు ఫణికృష్ణ కథ, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన రెండో పాట ఇది.
రెండు వారాల క్రితం రావే..రావే నా చెలియా…నీ కోసం వేచానే నా సఖియా అనే శ్రీరామచంద్ర పాడిన పాటను విడుదల చేసారు. అది కూడా మెలోడీ టచ్ తో క్యాచీ ట్యూన్ తో సాగింది.