మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి తగ్గేదే లే అంటూనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్ళీ తనకు ఏదో అయిపోతుందని, ఏదో చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని చెబుతున్నారు. నిజానికి ఈ రెండింటికీ మధ్య వైరుధ్యం చాలానే ఉంది.
ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మాదిరిగా తనను కూడా అరెస్ట్ చేసి కొట్టించేస్తారేమో అని కూడా ఆయన కంగారు పడుతున్నారు. ఇక న్యాయ స్థానాలు లేకపోతే తన లాంటి వారిని చంపేస్తారు కూడానూ అని అంటున్నారు.
ఇక అయ్యన్న అన్న మాటల్లో చిత్రమేంటి అంటే తాను ఏమీ అసభ్యంగా మాట్లడలేదని, జస్ట్ కౌంటర్స్ మాత్రమే ఇస్తున్నాను అని. అదే నిజం అనుకుంటే మంత్రి రోజా విషయంలో మగతనం మాటలు పదే పదే అన్నది ఎవరు అయ్యన్నా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇక మాట్లాడితే చాలు నోట్లోంచి ఆణిముత్యాలే రాలుతాయి కదా అని కూడా అంటున్నారు. చెత్త నా… అంటూ అయ్యన్న ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీద అనలేదా, ఇక ఆయన సీనియర్ మోస్ట్ పోలిటీషియన్ గా ఉంటూ అనుచితమైన కామెంట్స్ చేయలేదా అని నిలదీస్తున్నారు.
అయినా సరే అయ్యన్న మాత్రం తానేమీ ఎరగను అంటూ అమాయకత్వం నటిస్తున్నారు అని అంటున్నారు. ఇక తన ఇంటికి పోలీసులు పదే పదే వస్తున్నారని, తన మీద ప్రభుత్వం కక్ష కట్టిందని అయ్యన్న వాపోతున్నారు. మరి ఘనత వహించిన ఏయూ మీద ఆయన చేసిన అనుచిత కామెంట్స్ మీద ఏం చెబుతారు అని అడుగుతున్నారు.
మొత్తానికి ఒక వైపు ఎక్కడా తగ్గం, మీరేమి చేసుకుంటారో చేసుకోండి అని రెచ్చగొట్టేలా అంటూనే ఇంకో వైపు తనను ఏమైనా చేసి చంపేస్తారేమో అని బేలగా బెంగగా మాట్లాడడం ఒక్క అయ్యన్నకే చెల్లిందని అంటున్నారు.