22న మహానాయకుడు

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 22న మహానాయకుడు విడుదల కాబోతోంది. ఈమేరకు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. కథానాయకుడు విడుదలై, డిజాస్టర్ అయిన తరువాత రెండోభాగం విడుదల మీద ఏ…

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 22న మహానాయకుడు విడుదల కాబోతోంది. ఈమేరకు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. కథానాయకుడు విడుదలై, డిజాస్టర్ అయిన తరువాత రెండోభాగం విడుదల మీద ఏ విషయం క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి ఫస్ట్ వీక్ లో విడుదల చేయాల్సి వుంది.

పార్ట్-2 విడుదల చేస్తున్నాము, చేయడం లేదు అని కూడా చెప్పకుండా వదిలేసారు. మరోపక్క కొత్త సీన్లు జోడింపులు, పాత సీన్ల తొలగింపులు ఇలా షూటింగ్ పెంచుకుంటూ వెళ్లారు. ఆఖరికి రెండురోజుల క్రితం షూటింగ్ ఫినిష్ చేసారు. అప్పటికీ ఇంకా డేట్ గురించి బయటకు చెప్పలేదు.

ఇదిలావుంటే సినిమా రెండోభాగం అమ్మకాలు, తొలిభాగం నష్టాలకు సంబంధించి కొన్ని మల్లగుల్లాలు నడిచాయి. అవి ఎలా సెటిల్ అయ్యాయి అన్నది ఇంకా తెలియలేదు.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు