అయ్యో అనుపమ: అక్కడైనా నెట్టుకొస్తుందా..?

ఏదారి లేకపోతే గోదారే అంటారు. హీరోయిన్లకు కూడా అలాంటి ఓ దారి ఉంది. ఏ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే శాండిల్ వుడ్ కు చెక్కేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా అదేపని చేసింది.…

ఏదారి లేకపోతే గోదారే అంటారు. హీరోయిన్లకు కూడా అలాంటి ఓ దారి ఉంది. ఏ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే శాండిల్ వుడ్ కు చెక్కేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా అదేపని చేసింది. తెలుగులో ఆశించిన స్థాయిలో లక్ కలిసిరాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కన్నడ చిత్రసీమ బాటపట్టింది.

కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ సరసన నటసార్వభౌమ అనే సినిమా చేసింది అనుపమ. రీసెంట్ గా అక్కడ ఈ సినిమా విడుదలైంది. పునీత్ కు ఉన్న స్టార్ డమ్ కారణంగా ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి. పాజిటివ్ టాక్ కూడా బాగానే ఉంది. సో.. అనుపమ కన్నడ డెబ్యూ హిట్ అనే చెప్పాలి. కాకపోతే ఈ సక్సెస్ ట్రాక్ ను కన్నడంలో ఈమె ఎన్నాళ్లు కొనసాగిస్తుందనేది డౌట్.

మలయాళం సినిమాతో హీరోయిన్ గా మారిన అనుపమ, అట్నుంచి అటే టాలీవుడ్ కు వచ్చేసింది. అ..ఆ, ప్రేమమ్, శతమానంభవతి లాంటి సినిమాలతో మెప్పించినప్పటికీ.. గతేడాది ఆమెకు బొత్తిగా కలిసిరాలేదు. కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే, తేజ్ ఐ లవ్ యు.. ఇలా వరుసపెట్టి ఫ్లాపులిచ్చింది.

హలో గురు ప్రేమకోసమే సినిమా తర్వాత ఆమెకు తెలుగు నుంచి ఆఫర్లు తగ్గిపోయాయి. అటు తమిళ్ నుంచి ఆమెకు పూర్తిగా తలుపులు మూసుకుపోవడంతో చేసేదేంలేక కన్నడనాట అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే బోణీ బాగానే ఉంది. ఈ కొత్త ప్రయాణం అనుపమకు ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు