నిర్మాతగా కాజల్.. పార్టనర్ గా మరో హీరోయిన్?

కాజల్ నిర్మాతగా మారబోతోందనే విషయం దాదాపు పక్కా అయింది. కేఏ మూవీస్ అనే బ్యానర్ పై తనే నిర్మాతగా, నటిగా ఓ సినిమా చేయాలని కాజల్ భావిస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకుంది.…

కాజల్ నిర్మాతగా మారబోతోందనే విషయం దాదాపు పక్కా అయింది. కేఏ మూవీస్ అనే బ్యానర్ పై తనే నిర్మాతగా, నటిగా ఓ సినిమా చేయాలని కాజల్ భావిస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఈ బ్యానర్ లో ఓ స్లీపింగ్ పార్టనర్ కూడా ఉంది. ఆమె కూడా హీరోయిన్నే.

అవును.. కాజల్ స్థాపించబోయే బ్యానర్ లో తమన్న కూడా భాగస్వామిగా మారబోతోంది. వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడా ఫ్రెండ్ షిప్ ను ఇలా బిజినెస్ రూపంలోకి కూడా మార్చబోతున్నారు ఈ ఇద్దరు స్నేహితులు.

త్వరలోనే తన బ్యానర్ కు సంబంధించిన వివరాల్ని అఫీషియల్ గా వెల్లడించబోతోంది కాజల్. అదే టైమ్ లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాను కూడా ప్రకటిస్తుందట. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'అ!' అనే సినిమా వచ్చింది. ఆ టైమ్ లోనే కాజల్-ప్రశాంత్ మధ్య మరో సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిగాయట. అప్పుడు చెప్పిన కథే, కాజల్ ను నిర్మాతగా మార్చిందంటున్నారు.

ప్రశాంత్ వర్మతో చేయబోయే ఒక్క సినిమాకే ప్రొడ్యూసర్ గా మారుతోందా..? లేక నిర్మాతగా కెరీర్ ను కొనసాగించాలనుకుంటోందా అనే అంశంపై కాజల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గతంలో నాని కూడా ఇలానే నిర్మాతగా 'అ!' అనే సినిమా తీసి తర్వాత సైలెంట్ అయిపోయాడు.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు