బోయపాటి సినిమా ఇప్పట్లో కాదా?

బోయపాటి-బాలయ్య సినిమా వుంది. అది పక్కా. అందులో సందేహం లేదు. ముహుర్తం కూడా త్వరలో జరిగిపోతుంది. అది కూడా ఓకె. కానీ సినిమా మాత్రం సెట్ మీద చకచకా పరుగెత్తేది మే తరువాతే అని…

బోయపాటి-బాలయ్య సినిమా వుంది. అది పక్కా. అందులో సందేహం లేదు. ముహుర్తం కూడా త్వరలో జరిగిపోతుంది. అది కూడా ఓకె. కానీ సినిమా మాత్రం సెట్ మీద చకచకా పరుగెత్తేది మే తరువాతే అని వినిపిస్తోంది. బోయపాటి ఈ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ తయారుచేయాల్సి వుంది.

బాలయ్య మహానాయకుడు వ్యవహారాల నుంచి బయటపడాలి. ఏప్రియల్ అంతా ఎన్నికల మీద, మే అంతా కొత్త ప్రభుత్వ హడావుడి మీద వుంటారు. జూన్ కు కానీ పూర్తిగా రెడీ కారు. ఇదిలావుంటే, మహానాయకుడు ఫలితం కూడా చూడాలి. అది జనాదరణకు, ముఖ్యంగా కమర్షియల్ సక్సెస్ కు నోచుకుంటే ఓకె. లేదూ అంటే బాలయ్య మీద బర్డెన్ పడే ప్రమాదం వుంది.

ఇలాంటి నేపథ్యంలో 70 కోట్ల బడ్జెట్ చెబుతున్నారు బోయపాటి అని టాక్. మరి దానికి బాలయ్య వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి వుంటుంది. బోయపాటి కోసమో, మంచి ముహుర్తం కోసమో, క్లాప్ కొట్టి పూజ చేసేస్తారేమో కానీ, ఇవన్నీ అయ్యేసరికి, సినిమా ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం మాత్రం క్లియర్ గా వుంది.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు