తొలి తెలుగు పొలిటికల్ ఈవెంట్ ఆన్ స్క్రీన్ 'యాత్ర'. ఈ సినిమా విడుదలై మూడురోజులు అయింది. ఆ సినిమా బడ్జెట్ తో పోల్చుకుంటే చేసుకుంటే మంచి ఆశాజనకమైన కలెక్షన్లు వచ్చాయనే అనుకోవాలి. ఇదిలావుంటే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ తీసుకుంది. సుమారు 8 కోట్లకు కాస్త అటు ఇటుగా డిజిటల్ హక్కులు విక్రయించారు.
అంటే దాదాపు సగం పెట్టుబడి ఈ హక్కుల ద్వారా తిరిగి వచ్చేసినట్లే. హిందీ డబ్బింగ్ బేరాలు సాగుతున్నాయి. అది ఒక అరకోటి పైగానే రావచ్చు. శాటిలైట్ ఇంకా వుండనే వుంది. కొన్ని ఏరియాల అమ్మకం ద్వారా కొంత వచ్చింది.
మొత్తంమీద పెట్టుబడికి నష్టంలేకుండా యాత్ర సినిమా బయటపడిందనే అనుకోవాలి. మీడియం బడ్జెట్ తో తీయడం అన్నది యాత్ర సినిమాకు ప్లస్ అయింది. కానీ అదే ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే, బడ్జెట్ భారీనే, అమ్మకాలు కూడా భారీనే. నష్టాలు అంతకన్నా భారీనే.