ఊగిసలాటలో మారుతి

హీరోలు ఖాళీగా లేరు. డేట్ లు దొరకడం లేదు. అలా అని చకచకా పని చేసేవారు ఖాళీగా వుండలేరు. పోనీ అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒకటి చేసేయలేరు. ఇదీ దర్శకుడు మారుతి పరిస్థితి. ఆయనకు…

హీరోలు ఖాళీగా లేరు. డేట్ లు దొరకడం లేదు. అలా అని చకచకా పని చేసేవారు ఖాళీగా వుండలేరు. పోనీ అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒకటి చేసేయలేరు. ఇదీ దర్శకుడు మారుతి పరిస్థితి. ఆయనకు నిర్మాతలు కొదవలేదు. కానీ హీరోలే రెడీగా లేరు.

నానికి లైన్ చెప్పారు. అక్కడ నాని ఫ్రీ అవ్వాలి. ఆయనకు ఫుల్ కమిట్ మెంట్ లు వున్నాయి. ఇంకెవరూ కనుచూపు మేరలో దొరకడం లేదు. రామ్, గోపీచంద్ లాంటి వాళ్లు రెడీ కానీ, వర్కవుట్ అవుతుందా అని అనుమానం.

ఆఖరికి సాయిధరమ్ తేజ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆప్షన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ మనుసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తేజుతో సినిమా చేస్తే, మారుతి ఓ మెట్టు దిగిపోయాడు అని అంటారేమో అన్న చిన్న అనుమానం ఆయన సర్కిళ్లలో వినిపిస్తోంది. ఇంకోపక్కన అఖిల్ తో సినిమా చేయమని మారుతి మీద ప్రెజర్ పెరుగుతోంది.

దాంతో ఏమీ డిసైడ్ చేసుకోలేక, స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నానంటూ ఓ ట్వీటు వేసేసారు. దీనికీ కారణం వుంది. నిన్నటికి నిన్న యాత్ర బయోపిక్ మీద ట్వీట్ వేస్తే, ఫాలోవర్స్ అంతా సినిమా గురించి అడిగారు సాయిధరమ్ తేజ్ కు సినిమా చేయమనీ.. ఇంకా చాలా చాలా.. దాంతో అటు మీడియాకు, ఇటు ఫాలోవర్లకు ఒకటే సమాధానం అనేలా ట్వీటు ఒకటి వేసారు.

కానీ చిన్న అనుమానం స్క్రిప్ట్ లో బిజీగా వున్నా, ఇప్పట్లో డిసైడ్ చేయడంలేదు అని చెబుతున్నారే? మరి నానిని ఎలా కలిసినట్లు? ఎందుకు కలిసినట్లు? 

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా