సుకుమార్ సినిమా ఉంటుందా? ఊడుతుందా?

మైత్రీ మూవీస్ – సుకుమార్ సినిమా ఇప్పుడు వార్తల్లో నలుగుతోంది. రంగస్థలం తరువాత సుకుమార్-మైత్రీ మూవీస్ సినిమా కావడంతో ఈ సినిమా మీద పూర్తి దృష్టిపడింది. మహేష్ తో మాంచి సినిమా చేయాలన్నది సుకుమార్…

మైత్రీ మూవీస్ – సుకుమార్ సినిమా ఇప్పుడు వార్తల్లో నలుగుతోంది. రంగస్థలం తరువాత సుకుమార్-మైత్రీ మూవీస్ సినిమా కావడంతో ఈ సినిమా మీద పూర్తి దృష్టిపడింది. మహేష్ తో మాంచి సినిమా చేయాలన్నది సుకుమార్ ప్రయత్నం. అందుకే పీరియాడిక్ కథ చెప్పాడని, తరువాత వేరే లైన్ చెప్పాడనీ రకరకాల వార్తలు వినిపించాయి.

అయితే ఇవన్నీ వాస్తవమా? కాదా? అన్న రూఢీ లేదు. ఎందుకంటే మైత్రీమూవీస్ నుంచి ఎటువంటి స్పందనలేదు కాబట్టి. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి రంగప్రవేశం చేసారని, మహేష్ తో టచ్ లో వున్నారని వార్తలు పుట్టుకువచ్చాయి. అదే సమయంలో సుకుమార్ పూర్తి కథ తయారుచేయలేదని, మహేష్ నుంచి పూర్తి సమ్మతి రావడంలేదని కూడా వినిపించింది. ఏది కరెక్టో, కాదో తెలియకున్నా, అభిమానుల నుంచి మహేష్ మీద ఒకరకమైన వత్తిడి పెరుగుతోంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయమని అభిమానులు కోరుతున్నారు. ఎప్పుడూ క్లాస్ డ్రెస్సింగ్, సీరియస్ లుక్స్, స్టిఫ్ బాడీ లాంగ్వేజ్ తో అంతా పెద్దమనిషి తరహా పాత్రలే చేస్తున్నారని, పోకిరి, దూకుడు తరువాత సరైన మాస్ ఎంటర్ టైనర్ పడలేదని అభిమానుల గోల.

ఇదిలావుంటే సుకుమార్ తన నిర్మాణ భాగస్వామ్యంలో రెండు సినిమాలు తలకెత్తుకున్నారు. ఇంకో ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా వున్నాయి. ఇప్పటిదాకా మహేష్ కోసం కథ రెడీకాలేదని, కొంత సమయం కావాలని అడుగుతున్నారని కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ఆరునెలలు సమయం కావాలని సుకుమార్ అడిగారంటూ కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది.

ఆరునెలలు అంటే అనిల్ రావిపూడి చకచకా సినిమా లాగించేయగలరు. కానీ మహేష్ ఊ అనాల్సి వుంది. మరి సుకుమార్ కే టైమ్ ఇచ్చి, సైలెంట్ గా కూర్చుంటారా? లేక ఈ గ్యాప్ లో ఇంకో సినిమా చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఒకటి రెండురోజులు తన మ్యారేజ్ యానివర్సిరీ సందర్భంగా బయటకు వెళ్లే పనిలో వున్నారు. అట్నుంచి వచ్చాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఎలా గెలిచారు

డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!