వైఎస్ బయోపిక్ యాత్ర థియేటర్లలో వుంది. మరి వైఎస్ తనయుడు వైఎస్ జగన్ సినిమా చూసారా? చూస్తారా? సాధారణంగా ఇలాంటి సినిమాలు విడుదలైనపుడు సెలబ్రిటీల కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా షో లు వేయడం మామూలే. మరి జగన్ ఫ్యామిలీ సంగతేమిటి?
ఈ విషయమై యాత్ర సినిమా నిర్మించిన 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్ నుంచి కొన్ని వివరాలు లభించాయి. ఈ రోజు యాత్ర దర్శక, నిర్మాతలు వెళ్లి వైఎస్ జగన్ ను కలిసారు. సినిమా పై వస్తున్న స్పందనను వివరించారు. ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడమని కోరారు.
దానికి జగన్ స్పందిస్తూ, తాను ప్రత్యేకంగా కాకుండా, థియేటర్లోనే సినిమా చూస్తానని చెప్పారట. రెండు రోజుల ముందుగా అనుకున్న కమిట్ మెంట్ లు వున్నాయని, వీలుచూసుకుని థియేటర్లోనే చూస్తానని చెప్పారట.
ఇదిలా వుంటే యాత్ర యూనిట్ త్వరలో నేరుగా థియేటర్లకు వెళ్లి, వైఎస్ అభిమానులను, ప్రేక్షకులను కలిసే ప్లాన్ చేస్తోంది.