రాజకీయాలు అంటే చాలు దండం పెట్టేసారు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాజకీయాల ప్రస్తావన రాగానే చేతులెత్తి దండం పెట్టేసారు. ఈ రాజకీయాలేమిటో అర్థం కావు అనేసారు.
వాస్తవానికి మహేష్ తండ్రి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. అలాగే చిన్నాన్న కూడా రాజకీయాల్లో వున్నారు. బావ జయదేవ్ కూడా ఎంపీగా వున్నారు. కానీ మహేష్ మాత్రం ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రారు కాక రారు అని నమ్రత గట్టిగా చెప్పేసారు.
పనిలో పనిగా అస్సలు క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ లేని వ్యక్తి ఎవరైనా వున్నారు అంటే అది మహేష్ బాబే అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలా వుండడం ప్లస్ నో మైనస్ నో మరి? మహేష్ యాడ్ షూటింగ్ అంటే మాత్రం తను తప్పని సరిగా కూడా వుండాల్సిందే అని, మామూలు సినిమాల షూటింగ్ కు అక్కరలేదని వెల్లడించారు. మరి దీనివెనుక మర్మం ఏమిటో మాత్రం చెప్పలేదు.
పక్కా ఫ్యామిలీ వుమెన్ యాంగిల్ లోనే మాట్లాడి, ఆ విషయాలే వెల్లడించిన నమ్రత, మహేష్ తరపున అతని ఫ్యాన్స్ వ్యవహారాలు కానీ, ఆయన బిజినెస్ వ్యవహారాలు కానీ, పెట్టుబడులు కానీ, అన్నీ తానే చక్కబెడుతున్న కోణాన్ని మాత్రం పూర్తిగా ఈ ఇంటర్వూలో మరుగునపెట్టారు.