సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు

అదృష్టవశాత్తూ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయింది. లేకపోయివుంటే, బాబుగారి కోడి, కుంపటి మాత్రమే వుండి వుంటే, వాళ్లు చెప్పేవే నిజాలని, వాళ్లు ప్రవచించేవే సుభాషితాలని జనం ఇంకా నమ్ముతూ వుండేవారు. వాళ్లు అలా…

అదృష్టవశాత్తూ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయింది. లేకపోయివుంటే, బాబుగారి కోడి, కుంపటి మాత్రమే వుండి వుంటే, వాళ్లు చెప్పేవే నిజాలని, వాళ్లు ప్రవచించేవే సుభాషితాలని జనం ఇంకా నమ్ముతూ వుండేవారు. వాళ్లు అలా నమ్మబలుకుతూ వుండి వుండేవారు.

మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలుగుదేశం అనుకూల జనాల మాటలకు ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో బలంగా కౌంటర్లు పడ్డాయి. జగన్ ఎక్కడ దాక్కున్నారో కేసులకు భయపడి అని నారాలోకేష్ ట్వీటు వేయగానే, పాత వీడియోలు, పాత ప్రకటనలు బయటపెట్టి, ఆయనను మారు మాట్లాడకుండా చేసారు.

హోదా వస్తే ఆకాశం నుంచి అన్నీ ఊడిపడతాయి అనుకుంటున్నారు, ఇక ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటన్నారు అంటూ గతంలో లోకేష్ చెప్పిన మాటల వీడియోలను సోషల్ మీడియాలో వుంచారు.

అలాగే శభాష్ మోడీ అంటూ చంద్రబాబు ప్రశంసలను, సోనియాపై చేసిన విమర్శలను మాజీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు ట్విట్టర్ లో వుంచారు. డిజిటల్ యుగం కావడంతోనూ, మోడీతో విడాకులు జరిగి ఇంకా ఎంతోకాలం కాకపోవడంతోనూ, బాబు అప్పట్లో చేసిన ప్రసంగాలు, ఇచ్చిన స్టేట్ మెంట్ లు అన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు బయటపెడుతూ ఎదురుదాడి చేస్తున్నారు.

మొత్తంమీద మోడీ పర్యటనలో బయటదేశం నాయకులు వైకాపా మీద దాడిచేస్తుంటే సోషల్ మీడియాలో జనాలు దేశం మీద దాడిచేస్తూ ఆడేసుకుంటున్నారు.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా