ఆర్జీవీ స్టయిల్ వైస్రాయ్ ఎపిసోడ్

ఎన్టీఆర్, వైఎస్ఆర్ జీవితాలపై సినిమాలు వచ్చేసాయి. ఇక లక్ష్మీపార్వతి జీవిత కోణంలోంచి ఎన్టీఆర్ చూడాల్సిన సినిమానే బకాయి వుంది. సకుటుంబ కుట్రల చిత్రం అంటూ, లవర్స్ డే నాడు శాంపిల్ చూపించబోతున్నారు ఆర్జీవీ. ఇదిలావుంటే…

ఎన్టీఆర్, వైఎస్ఆర్ జీవితాలపై సినిమాలు వచ్చేసాయి. ఇక లక్ష్మీపార్వతి జీవిత కోణంలోంచి ఎన్టీఆర్ చూడాల్సిన సినిమానే బకాయి వుంది. సకుటుంబ కుట్రల చిత్రం అంటూ, లవర్స్ డే నాడు శాంపిల్ చూపించబోతున్నారు ఆర్జీవీ. ఇదిలావుంటే ఈ సినిమా చంద్రబాబు వెన్నుపోటును ఎక్కువగా టార్గెట్ చేస్తారనే గ్యాసిప్ లు వినిపిస్తూ వస్తున్నాయి.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ల ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు ఆగస్టు సంక్షోభం సమయంలో ఎలా వ్యవహరించారు అన్నది ఆర్జీవీ బలంగా చెప్పబోతున్నారని తలుస్తోంది. హరికృష్ణ, బాలకృష్ణలను బాగా టార్గెట్ చేసినట్లు తెలిసింది.

ఇదిలావుంటే సినిమా కోసం ఇటీవల వైస్రాయ్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారు. వైస్రాయ్ హోటల్ ను గుర్తుకుతెచ్చే ఓ భవంతి ముందు ఈ ఎపిసోడ్ ను, ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన సంఘటనలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

అందుతున్న వార్తలను బట్టి చూస్తుంటే వర్మ తన సినిమా ద్వారా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా