అశ్వనీదత్ వెనక్కు లాగుతున్నారా?

ఏ సినిమా ఎప్పుడు చేయాలి అన్నది హీరోలకు బాగానే తెలుసు. వాళ్ల ప్లానింగ్ వాళ్లకు వుంటుంది. బాహుబలి, సాహో, రాధేశ్వామ్, సలార్ ఇలా అన్నీ హెవీ సినిమాలు చేస్తూ వస్తున్నారు ప్రభాస్.  Advertisement అందుకే…

ఏ సినిమా ఎప్పుడు చేయాలి అన్నది హీరోలకు బాగానే తెలుసు. వాళ్ల ప్లానింగ్ వాళ్లకు వుంటుంది. బాహుబలి, సాహో, రాధేశ్వామ్, సలార్ ఇలా అన్నీ హెవీ సినిమాలు చేస్తూ వస్తున్నారు ప్రభాస్. 

అందుకే రిలీఫ్ గా వుంటుందని ఓ ఎంటర్ టైనర్ చేయాలనుకున్నారు. ఆ జానర్ లో పట్టు వున్న మారుతికి చాన్స్ ఇచ్చారు. పెద్ద సినిమాల షూటింగ్ టైమ్ లో విరామం దొరికినపుడు ఈ సినిమా కానిచ్చేయాలని ప్లాన్.

కానీ నిర్మాత అశ్వనీదత్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి. ప్రాజెక్ట్ కే అంటూ వందల కోట్ల సినిమా తాము తీస్తుంటే మధ్యలో ఇలాంటి ఎంటర్ టైనర్ చేయడం ఏమిటి అని ఆయన పదే పదే ప్రభాస్ ను క్వశ్చన్ చేస్తున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. అయితే ఆయన మాటలను ప్రభాస్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

తన కెరీర్ ఎలా ప్లాన్ చేసకోవాలో? ఎప్పుడు ఏ సినిమాలో ప్రభాస్ కు తెలియదా? అని మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే జిల్ లాంటి సినిమా ఇచ్చిన రాథాకృష్ణ కే భారీ సినిమా ఇచ్చారు ప్రభాస్. అతనితో పోల్చుకుంటే మారుతి ట్రాక్ రికార్డ్ చాలా బెటర్. అందువల్ల ప్రభాస్ ఛాయిస్ తప్పేం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. 

ఇంతకీ అశ్వనీదత్ వెనక్కు లాగుతున్నారన్నది నిజమేనా? గ్యాసిప్ నా?