కరోనా కోట్లు మిస్ అయిపోయాయా?

పార్లమెంట్ సభ్యుడు, వైకాపా నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో మహా యాక్టివ్ గా వుంటారు. ఆయన కొత్తగా ఓ పాయింట్ లేవనెత్తారు. కరోనా టైమ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల తేదేపా…

పార్లమెంట్ సభ్యుడు, వైకాపా నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో మహా యాక్టివ్ గా వుంటారు. ఆయన కొత్తగా ఓ పాయింట్ లేవనెత్తారు. కరోనా టైమ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల తేదేపా అనుకూల మీడియా కోట్లు నష్టపోయిందట. ఈ టైమ్ లో కనుక చంద్రబాబు సిఎమ్ గా వుండి వుంటే, కరోనా-తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా-ప్రభుత్వ చర్యలు అంటూ రోజూ పుంఖాను ఫుంఖాలుగా ఫుల్ పేజీ ప్రకటనలు తమ అను'కుల'మీడియాకు అందించి, కోట్లకు కోట్ల ప్రజల సొమ్ము అప్పనంగా అందించేవారు కదా అని విజయ్ సాయి అనుమానం వ్యక్తం చేసారు.

ఇది కూడా నిజమే కదా? బాబు హయాంలో ఆయన అనుకూల మీడియాకు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చి, కోట్లకు కోట్లు బిల్లుల రూపంలో అందించారు. ఏదో ఒక వంకన, ఏదో ఒక పేరుతో ప్రకటనలే ప్రకటనలు. అవి కూడా మళ్లీ ఫుల్ పేజీలే. 

విజయసాయి అన్నట్లు ఇప్పుడు కనుక బాబుగారు సిఎమ్ గా వుండి వుంటే, ఈ కరువు టైమ్ లో సదరు మీడియాకు కోట్లు వచ్చి పడేవి. ఇప్పుడు ఆ కోట్లు అన్నీ మిస్ అయిపోయాయి. అయినా అలా మిస్ అయిపోతున్నాయి గత తొమ్మిది నెలలుగా అనే కదా, అవాకులు, చవాకులు రాస్తూ జగన్ ను టార్గెట్ చేస్తున్నది.

అయితే తమన్ లేదంటే దేవీశ్రీ.. అనుప్ కి ఏమైంది?