ఇది కరోనా వ్యాధి లక్షణం కాదు. కాబట్టి అనసూయ టెన్షన్ పడాల్సిన పని లేదు. తనకు వేళ్లు బాగా నొప్పి పెడుతున్నాయనే విషయాన్ని స్వయంగా అనసూయ బయటపెట్టింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో చాలామందిని బ్లాక్ చేయాల్సి రావడం వల్ల, తన వేళ్లు నొప్పి పెడుతున్నాయని చెప్పుకొచ్చింది. అనసూయ అంతమందిని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
నిన్న కేటీఆర్ పెట్టిన ట్వీట్ కు స్పందిస్తూ, అనసూయ కూడా ఓ ట్వీట్ పెట్టింది. “లాక్ డౌన్ ఓకే కానీ మేం పని కోసం బయటకు వెళ్లకపోతే, డబ్బులు సంపాదించుకోలేం. ప్రతి నెల మేం ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కట్టుకోవాలి. కాస్త ఈ కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది” అంటూ ట్వీటింది
దీనిపై సోషల్ మీడియాలో అనసూయపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. నువ్వు అంత పేదరికంలో ఉన్నావా అంటూ చాలామంది ఆమెను కామెంట్ చేశారు. అయితే తను తన కోసం చెప్పలేదని, కొంతమంది పేదవాళ్లను ఉద్దేశించి “మేము” అనే పదాన్ని వాడానని అనసూయ వరుసగా వివరణలు ఇచ్చుకుంటూ వచ్చింది.
అయినప్పటికీ ట్రోలింగ్ ఆగలేదు. దీంతో కొన్ని ఎకౌంట్స్ ను ఆమె బ్లాక్ చేయాల్సి వచ్చింది. అలా ఎకౌంట్స్ బ్లాక్ చేస్తూ చేస్తూ తన వేళ్లు నొప్పి పెట్టాయంటూ తాజాగా మరో ట్వీట్ పెట్టింది అనసూయ