అమృతా అయ్యర్…కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న హీరోయిన్. బెంగళూరులో పుట్టిపెరిగిన అమృతా…సినిమా అవకాశాలను మాత్రం మళయాళంలో దక్కించుకొంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఎంటరైంది. ఇలయ దళపతి విజయ్ ‘బిగిల్’ సినిమాలో కీర్తనగా తమిళ తంబీలకు ఆమె మరింత చేరువైంది. ఇప్పుడు తెలుగువారిని తన అందచందాలతో పాటు నటనతో ఆకట్టుకోవడానికి ‘30 రోజుల్లో ప్రేమించడమెలా’గో సినిమాతో మన ముందుకొస్తోంది. తెలుగులో మొదటి సినిమా విడుదల కాకుండానే మరో రెండు సినిమాలను దక్కించుకున్న అమృతా అయ్యర్ అనేక విషయాలపై మాట్లాడింది.
బెంగళూరుకు చెందిన తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పింది. తన కుటుంబంలో ఇంత వరకూ ఎవరూ సినిమాల్లోకి రాలేదని, తానే మొదటి వ్యక్తినని వెల్లడించింది. తన సోదరి ప్రియాంక మంచి డ్యాన్సర్‌తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారణిగా చెప్పుకొచ్చింది.
చదువుకునే రోజుల్లో సరదాగా మోడలింగ్ మోడలింగ్ చేస్తున్న సమయంలోనే మలయాళంలో సినిమా అవకాశం వచ్చిందని అమృతా తెలిపింది. అయితే సినిమాలను ప్రొఫెషన్‌గా తీసుకుందామనే ఉద్దేశంతో రాలేదని ఆమె చెప్పింది. ఏదో సరదాగా ఒకటి రెండు సినిమాలు చేద్దామనుకుని వచ్చినట్టు ఆమె తెలిపింది. కోలీవుడ్‌లో విజయ్‌తో చేసిన ‘బిగిల్’ సూపర్ డూపర్ హిట్ కావడంతో అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయని పేర్కొంది.
తెలుగులో తన మొదటి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడమెలా’అని వెల్లడించింది. దీని షూటింగ్ జరుగుతున్నప్పుడే రెండు సినిమాలకు కమిట్ అయ్యానని, తెలుగులో నాగశౌర్యగారి పక్కన చేస్తున్న సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా తనతో కాంప్రమైజ్ అయిపోయారని అమృతా నవ్వుతూ చెప్పింది.
తెలుగులో హీరో రామ్‌తో చేస్తున్న ‘రెడ్’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని తెలిపింది. అయితే ఈ సినిమా గురించి వివరాలు చెబితే ఆ థ్రిల్ పోతుందని అమృతా చెప్పింది.
సంప్రదాయ కుటుంబం నుంచి తనను అందంగా చూపిస్తానంటే అభ్యంతరం చెప్పనని, ఎందుకంటే సినిమా అంటే గ్లామర్ ఫీల్డ్ అని తనకు తెలుసునని ఆమె చెప్పింది. అయితే ఏదైనా శ్రుతి మించనంత వరకే అని కండీషన్ చెప్పిందిం. అంటే మితిమీరిన అందాల ఆరబోత చేయమన్నంత వరకే గ్లామర్‌గా కనిపించడానికి తనకెలాంటి అభ్యంతరాలుండవని ఆమె చెప్పుకొచ్చింది. అందాల ఆరబోత విషయంలో తన పరిధులను అమృతా ఓపెన్‌గా వెల్లడించింది.