ఈ వీడియోలను కోర్టు స్వీకరిస్తే?

స్వచ్ఛంధంగా కర్ఫ్యూ విధించుకుని ఎవరికి వారు ఇళ్లలో వుండాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. విరుగుడు లేని కరోనా వైరస్ ను అరికట్టడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. ఎందుకంటే వ్యాప్తి చెందకుండా చూడడమే…

స్వచ్ఛంధంగా కర్ఫ్యూ విధించుకుని ఎవరికి వారు ఇళ్లలో వుండాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. విరుగుడు లేని కరోనా వైరస్ ను అరికట్టడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. ఎందుకంటే వ్యాప్తి చెందకుండా చూడడమే దీనికి విరుగుడు. అందులో సందేహం లేదు. అందుకే దేశం అంతా ప్రధాని మోడీ మాట మీద నడవాలని నిర్ణయించుకుంది. అదే బాట పట్టింది.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కర్ఫ్యూ విధించినది కాదు. జనం విధించుకున్నది. నిర్భంధ కర్ఫ్యూ కాదు. స్వచ్ఛంధ కర్ఫ్యూ.  పొరపాటునో, లేదా అవసరంతోనో ఎవరైనా దీనిని ఉల్లంఘించి బయటకు వస్తే, పోలీసులు చేయాల్సింది వారిని వారించి, విషయం వివరించి, వెనక్కు పంపాలి.

అంతే కానీ లాఠీ పట్టుకుని, ఏ ఉద్యమకారులనో, నిరసన కారులనో కొట్టినట్లు బాదేయడం కాదు. నిన్నటికి నిన్న ఇదే జరిగింది. సోషల్ మీడియాలో అనేక విడియోలు చోటు చేసుకున్నాయి. పోలీసులు కనీసం బయటకు వచ్చిన వ్యక్తి వెర్షన్ వినకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టేయడం. అలా దెబ్బలు తిన్న వ్యక్తి ఎక్కడకు వెళ్లాలి? ఎవరు ట్రీట్ చేస్తారు? 

ఇలాంటి విషయం ఏమైనా ఆలోచించారా? అసలు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా? బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసిందా? వాటిని ధిక్కరిస్తే లాఠీలతో బాదేయమని నిబంధన విధించిందా? రాజకీయంగా అనేక విషయాలను సూ మోటోగా విచారణకు స్వీకరించే కోర్టులు ఇప్పుడు ఈ విడియోలను సూ మోటోగా స్వీకరించి విచారణ జరిపిస్తే పోలీసుల దగ్గర సమాధానం ఏమి వుంటుంది? 

ఇండియాలో ఇలాగే చేయాలి. లేదూ అంటే మాట వినరు. అంటూ కామెంట్ లు పెట్టడం, కామెంట్ చేయడం సులువే. అవసరం పడి బయటకు వెళ్లి, ఇలా దెబ్బలు తింటే తెలుస్తుంది అసలు విషయం. కష్టంలో వున్న ప్రజలను పోలీసులు మరింత కష్టాల్లోకి నెట్టకూడదు. కర్ఫ్యూ అర్థం, పరమార్థం వివరించి, నచ్చ చెప్పాల్సిందే. ఎందుకంటే ఈరోజు వేరు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. నిన్న వేరు ప్రజలను మోడీ స్వచ్ఛంథంగా పాటించమన్నారు. పాటించడం, పాటించకపోవడం జనం విజ్ఞత. అంతే తప్ప అలా అని చెప్పి, పోలీసులు చేయి చేసుకోమని మోడీ కానీ కేసిఆర్ కానీ చెప్పలేదుగా.

అయితే తమన్ లేదంటే దేవీశ్రీ.. అనుప్ కి ఏమైంది?

మార్చ్ 31 వరకూ ఆంధ్ర లాక్ డౌన్