కామెడీ సినిమా అని చెబితే చాలు. మళ్లీ ప్రత్యేకంగా సర్రయిలిస్ట్ కామెడీ అనక్కరలేదు. కామెడీలో లాజిక్ వుండదు. లాజిక్ ను మరీ దాటేస్తే అది సర్రయిలిస్ట్ కామెడీ అవుతుందేమో? గతంలో వచ్చిన జంబలకిడి పంబ ఇలాంటిదే.
జూలై 8 న విడుదలవుతున్న హ్యాపీ బర్త్ డే సినిమా ఇలాంటి జానర్ లోనే తయారవుతోంది. వాస్తవిక ప్రపంచంలో కామెడీ పుట్టించడం వేరు. అధివాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళ్లి కామెడీ చేయడం వేరు.
హ్యాపీ బర్త్ డే సినిమాలో అదే చేసారు. గన్స్ కు ప్రవేశం లేని ఇండియాలో ప్రతి చేతికి గన్ వస్తే ఎలా వుంటుంది అన్నది ఫన్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో చాలా మంది కమెడియన్లు వున్నారు. వెన్నెల కిషోర్, సత్య, గుండు సుదర్శన్ తదితరులు ప్రధానంగా కనిపించారు.
ఓ వజ్రాల లైటర్ అన్నది కథలో కీలకంగా వుండేలా కనిపిస్తోంది. ఓవర్ ఫన్ ను క్లాస్ టచ్ తో అందించే కొత్త ప్రయత్నాన్ని దర్శకుడు రితేష్ రానా చేసినట్లుంది. ఈ సినిమాకు నిర్మాత చెర్రీ..సమర్పణ మైత్రీ మూవీ మేకర్స్.