Advertisement

Advertisement


Home > Politics - National

శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, సెయింట్ లూయిస్ నగరం

శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, సెయింట్ లూయిస్ నగరం

జూన్ 26 ఆదివారం సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ నందు అత్యంత కన్నుల పండువగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది.

అద్భుతంగా అలంకరింప బడిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానము నుండి విచ్చేసిన అర్చక స్వాములు మరియు అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సన్నాయి మరియు సంగీత సేవల నడుమ అత్యద్భుతంగా నిర్వహింప బడింది. వేలాది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవం దర్మించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులైనారు. కళ్యాణం అనంతరం గురుడ వాహన సేవ నృత్య ప్రదర్శనల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మానికి TTD Chairman శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు, TTD AEO శ్రీ వెంకటేశ్వర్లు గారు, SVBC Director శ్రీ  శ్రీనివాస రెడ్డి గారు, APNRT చైర్మన్ శ్రీ మేడ‌పాటి వెంక‌ట్ గారు, నార్త్ అమెరికా ప్ర‌త్యేక ప్ర‌తినిధి శ్రీ రత్నాక‌ర్ ఆర్ పండుగాయల మ‌రియు నాటా ప్రెసిడెంట్ శ్రీ శ్రీ‌ధ‌ర్ రెడ్డి కొరిశపాటి గారు విచ్చేసి వారి అభినందనలు తెలిపారు.

సెయింట్ లూయిస్ వాస్తవ్యులు తాటిపర్తి గోపాల్ రెడ్డి, పమ్మి సుబ్బారెడ్డి వారి మిత్ర బృందం TTD చైర్మన్ - శ్రీ వై.వి.సుబ్బారెడ్డి గారితో, APNRT శ్రీ మేడపాటి వెంకట్ గారితో, మరియు హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ Board of Trustees Chairman శ్రీ రజనీకాంత్ గంగవరపు మరియు అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి నాయుడు గార్ల తో సమన్వయం చేసి, స్వామివారి కళ్యాణం సెయింట్ లూయిస్ నగరంలో నిర్వహింప బడటానికి ఎంతో కృషి చేశారు.

హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ పాలకవర్గం సభ్యుల సహకారంతో, వినయ్ వేములపల్లి, నెమ్మది నారాయణ, కాజా విశ్వేశ్వర రావు గారు, కాజా రామారావు గారు, రాంమోహన్ రెడ్డి పాడూరు, సురేంద్ర బైరపునేని, మేఘనారెడ్డి, వేములపల్లి నాగమణి, తాటిపర్తి సుబ్బారెడ్డి, మన్నెపల్లి రాజేంద్ర, కృష్ణ ఘంటాజీ, వెంకట్ బండి, అల్లం తిరురెడ్డి, ప్రీతం పొన్నాపు రెడ్డి, నవీన్‌ గుడవల్లి, నరేంద్ర వర్మ, ఉప్పలపాటి రవి, అనమల మూడి చంద్ర మరియు ఎంతో మంది వాలంటీర్ల సహకారం తో ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి చక్కని కృషి చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?