Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండ్రా బాబూ!

పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండ్రా బాబూ!

ఇలా కాస్త అసహనం వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు.. స్వయంగా హీరో రామ్ పోతినేని. తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు రామ్ ఇలా చెక్ పెట్టాడు. తను పెళ్లి చేసుకోవడం లేదని.. పుకార్లు ఆపండి అంటూ వేడుకుంటున్నాడు.

"ఓరి దేవుడా.. ఆపండి బాబూ.. ఈ పుకార్లు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. చివరికి నేను నా సొంత కుటుంబానికి, స్నేహితులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సీక్రెట్ హైస్కూల్ స్వీట్ హార్ట్ అంటూ ఎవ్వరూ లేరు. నేను అలాంటి అమ్మాయిని ఎవ్వర్నీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, నేను హైస్కూల్ కు సరిగ్గా వెళ్లిందే లేదు."

ఇలా తన పెళ్లి పుకార్లను ఖండించాడు హీరో రామ్. ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ ఏడాదిలోనే అతడి పెళ్లి ఉంటుందంటూ వరుసగా కథనాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తన హైస్కూల్ ఫ్రెండ్ ను రామ్ పెళ్లాడబోతున్నాడంటూ వరుసగా కథనాలు వచ్చాయి. రోజురోజుకు ఈ పుకార్లు పెరిగిపోతుండడంతో రామ్ ఇలా స్వయంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఈ హీరో తన ఫోకస్ మొత్తం ది వారియర్ సినిమాపై పెట్టాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా జెండా పాతేయాలని గట్టిగా కోరుకుంటున్నాడు. అందుకే ఎగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నాడు. మరో 2 రోజుల్లో ట్రయిలర్ లాంఛ్ కూడా పెట్టుకున్నాడు.

ఓవైపు ఇలా ప్రచార కార్యక్రమాల్లో రామ్ బిజీగా ఉంటుండగానే, మరోవైపు ఇలా పుకార్లు కార్చిచ్చులా వ్యాపించింది. 2 రోజుల పాటు వీటిని లైట్ తీసుకున్న రామ్.. స్నేహితులు, సన్నిహితుల నుంచి వరుసపెట్టి ఎంక్వయిరీలు రావడంతో, ఇలా సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?