Advertisement

Advertisement


Home > Movies - Movie News

ట్రయిలర్ ‘పక్కా’గా రెండో సారి

ట్రయిలర్ ‘పక్కా’గా రెండో సారి

సినిమా విడుదలకు ఒకటి రెండు రోజలు ముందుగా ట్రయిలర్ మరోసారి కట్ చేసి వదలడం ఈ మధ్య ఓ సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఇలా విడుదల చేసే ట్రయిలర్లలో ఎక్కువగా రిపీట్ కంటెంట్ వుంటుంది. 

అది బోర్ కొడుతుంది లేదా వీళ్ల దగ్గర ఎక్కువ కంటెంట్ లేనట్లుంది అని అనిపిస్తుంది. అయితే ఇలాంటి అపప్రధ నుంచి తప్పించుకుంది ఈ రోజు విడుదల చేసిన పక్కా కమర్షియల్ ట్రయిలర్.

కొన్ని వారాల క్రితం ఓ ట్రయిలర్ వదిలారు. స్టోరీ లైన్ చెప్పేసారు. కానీ ఇప్పుడు రిలీజ్ ట్రయిలర్ వదిలారు. అది చూస్తుంటే ఇంతకు ముందు చెప్పిన స్టోరీకి అదనంగా సమ్ థింగ్ వుంది అనిపించేలా కట్ చేసారు. ట్రయిలర్ కట్ చేసిన పద్దతి బాగుంది.

ఒక టెన్ పర్సంట్ రిపీట్ సీన్లు వున్నాయి కానీ మిగిలిన సీన్లు అన్నీ కొత్తగానే వున్నాయి. గోపీచంద్, రాశీఖన్నా, సప్తగిరి, సత్యరాజ్ లను ఎలా చూస్తే ఇష్టపడతారో అలాంటి సీన్లు ఏరి కోరి వేసినట్లుంది. మారుతి దర్శకత్వంలో తయారై ఈ వారం విడుదలవుతున్న ఈ సినిమాకు నిర్మాతలు బన్నీవాస్, యువి వంశీ. నిర్మాణం ఎస్కేఎన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?