ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది

వాస్తుపరంగా ఏ దిక్కు వైపు తలపెట్టి పడుకోవాలో చాలామంది చెబుతారు. కానీ ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదనే విషయంపై కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. కొంతమంది కుడివైపు తిరిగి పడుకుంటే మంచిదంటారు. మరికొందరు ఎడమవైపు…

వాస్తుపరంగా ఏ దిక్కు వైపు తలపెట్టి పడుకోవాలో చాలామంది చెబుతారు. కానీ ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదనే విషయంపై కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. కొంతమంది కుడివైపు తిరిగి పడుకుంటే మంచిదంటారు. మరికొందరు ఎడమవైపు మంచిదంటారు. మరి ఇందులో ఏది నిజం?

ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారో చూద్దాం. శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి, మధ్యనాడి అనే మూడు నాడులుంటాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సూర్యనాడి పనికొస్తుంది. ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు ఇది మరింత బాగా పనిచేస్తుందని వాళ్లు చెబుతారు.

ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకుంటే కలిగే ఉపయోగాల్ని వివరిస్తున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయంలోని యాసిడ్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే కుడివైపు తిరిగి పడుకుంటే, ఈ యాసిడ్స్ అన్నీ పైకి ఎగదన్నుతాయి. అందుకే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకుంటే ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాల్ని బయటకు పంపించడంలో లింప్ గ్రంథులు ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఈ గ్రంధులు బాగా పనిచేస్తాయి. అంతేకాదు, గురక సమస్య ఉన్నవాళ్లు కూడా ఎడమవైపు తిరిగి పడుకుంటే మంచిదని వైద్యులు చెబుతుంటారు.

కుడివైపు తిరిగి పడుకునే వాళ్ల కంటే, ఎడమ వైపు తిరిగి ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లు మరింత చురుగ్గా ఉన్నట్టు శాస్త్రీయంగా రుజువైంది. కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు ఎడమ వైపు తిరిగి విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. 

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం