పవన్ కల్యాణ్.. కొత్త షేడ్స్.. కొత్త గెటప్స్

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. కథ  ప్రకారం,…

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. కథ  ప్రకారం, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 3 షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

ఆ 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ లాక్ చేశారు. వీటిలో ఒక గెటప్ మాత్రమే ఫస్ట్ లుక్ లో కనిపించింది. అంటే సినిమాలో మరో 2 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉన్నాయన్నమాట.

మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. ఈ సినిమాలో  వజ్రాల దొంగ వీరమల్లుగా పవన్ ఓ షేడ్ లో కనిపించబోతున్నాడు. దీంతో పాటు సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా, దేశం కోసం పోరాడే వీరుడిగా కూడా పవన్ కనిపించబోతున్నాడు.

17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససిరీస్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కాస్ట్యూమ్ డిజైన్స్ నుంచి కంకణం, ఉంగరాలు, వేసుకునే చెప్పుల వరకు రీసెర్చ్ చేసి మరీ డిజైన్ చేశారు. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు వర్క్ చేసిన డిజైనర్ ఐశ్వర్యను వీరమల్లు సినిమా కోసం కూడా తీసుకున్నారు.

ఈ సినిమాలో పవన్ కోసం వివిధ ప్రాంతాల నుంచి వెయ్యి తాన్ల గార్మెంట్ ను తీసుకొచ్చారు. వాటితో మొత్తంగా 30 రకాల డిజైన్లను తయారుచేశారు. ఆ డిజైన్లంటినీ పవన్ రెండు సిట్టింగ్స్ లో ఓకే చేశాడు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి, మొఘల్ చరిత్రను స్టడీ చేసి పవన్ యాక్ససిరీస్ ను డిజైన్ చేశారు.

ఇవన్నీ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్, హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన చార్మినార్ సెట్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం