ప్రభాస్ నిజంగా పెళ్లి చేసుకుంటాడా?

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలివ్వడంతో అంతా నిజమే అనుకున్నారు.

ప్రభాస్ పెళ్లిపై పుకార్లు కొత్త కాదు. ఆ మాటకొస్తే సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో అతడి పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ మేటర్ ఎత్తుకోవడంతో, అందరి దృష్టి బాహుబలి పెళ్లిపై పడింది.

హైదరాబాద్ కు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలివ్వడంతో అంతా నిజమే అనుకున్నారు.

గడిచిన దశాబ్ద కాలంగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ స్పందించడం కూడా మానేశాడు. అయితే ఈసారి ప్రధాన మీడియా నుంచి కథనాలు రావడంతో, అతడి టీమ్ స్పందించింది. అవన్నీ పుకార్లని కొట్టిపారేసింది.

ఒకప్పుడు ప్రభాస్-అనుష్క జోడీపై జోరుగా పుకార్లు నడిచాయి. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వరకు వెళ్లింది ప్రచారం. అయితే తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.

గతేడాది భీమవరంకు చెందిన ఓ అమ్మాయితో ప్రభాస్ పెళ్లంటూ ప్రచారం జరిగింది. అంతకంటే ముందు ఓ ఎంపీ కూతురుతో పెళ్లంటూ గాసిప్స్ వచ్చాయి. మధ్యలో ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా గట్టిగా వినిపించింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రభాస్ వివాహంపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. 45 ఏళ్ల ప్రభాస్ మాత్రం అవేం పట్టించుకోకుండా తన సినిమాలు తాను చేసుకుపోతున్నాడు.

6 Replies to “ప్రభాస్ నిజంగా పెళ్లి చేసుకుంటాడా?”

Comments are closed.