ఇది ఒక విచిత్రమైన కోడి పంచాయితీ. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో తనకు ఎలాంటి పెద్ద అవకాశాలు దక్కలేదని ఆమె నిరసన చేపట్టారా? అని ఆశ్చర్యపోవద్దు. అలాంటిదేం లేదు. ఆమె సాక్షి పత్రికకు వ్యతిరేకంగా ఈ నిరసన చేశారు.
కోళ్ల వ్యాపారుల దగ్గరినుంచి కమిషన్ తీసుకుంటున్నట్టుగా ఆమె మీద సాక్షిలో వార్తలు ప్రచురించారట. అందుకు నిరసనగా.. ఆమె తన వెంట కొన్ని కోళ్లను కూడా తీసుకువచ్చి, వాటి మెడలో ప్లకార్డులు కట్టి.. నిరసన ప్రదర్శన చేశారు.
ఇంతకూ విషయం ఏంటంటే.. కర్నూలు జిల్లాలో కోళ్ల వ్యాపారంలో కూడా నాయకుల దందా నడుస్తోందనే ఆరోపణలున్నాయి. అయితే గతంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు.. చికెన్ సెంటర్ల నుంచి ఒక కిలో చికెన్ కు రూ.10 వంతున కమిషన్లు వసూలు చేసినట్లు భూమా అఖిలప్రియ ఆరోపించారు. పేపర్లో వచ్చే ధరకు చికెన్ ఇప్పిస్తానని తాను ప్రెస్ మీట్ లో చెప్పానని, ఆ హామీ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగానే.. తానే కమిషన్ తీసుకుంటున్నానంటూ సాక్షి పత్రికలో రాశారని ఆమె చెబుతున్నారు.
ఆధారాల్లేకుండా రాశారని అంటున్నారు. ‘మాపై రాసిన వార్తలకు ఆధారాలు ఎక్కడ’ అంటూ కోళ్ల మెడలో ప్లకార్డులు కట్టారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు వార్తలు రాస్తే పత్రికల ఆఫీసుల మీద దాడిచేసేవారని, తమ ప్రభుత్వంలో వారి ఆఫీసు ఎదుట నిరసన చేస్తున్నామని అన్నారు.
అయితే ఈ నిరసన సందర్భంగా భూమా అఖిలప్రియ ఒక అందమైన కథ అల్లారు. ఆమె చెప్పిన కథ ఏంటంటే.. కూటమి అధికారంలోకి రాకముందు.. నంద్యాలలో కిలో చికెన్ ధర రూ.250 నుంచి 280 వరకు ఉండేదిట. కానీ తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆళ్లగడ్డలో చికెన్ ధర రూ.150 నుంచి రూ.170 వరకు ఉన్నదట! తాము అవినీతి చేసి ఉంటే రేటు పెరగాలి తప్ప.. ఎలా తగ్గుతుంది అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఏదో నాటకీయంగా ఆమె చెబుతున్న గణాంకాలు, ధర తగ్గుదల అనేది అందంగా కనిపించవచ్చు గానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే.. కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందనే సంగతిని ఆమె చాలా కన్వీనియెంట్ గా దాచిపెడుతున్నారు. ధరలు తగ్గడం అనేది తమ ప్రభుత్వం సాధించిన ఘనత కింద చెప్పుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా.. అసలు చికెన్, గుడ్లు వాడకమే ప్రజలంతా మానేస్తే.. ధరలు దారుణంగా పడిపోయాయి.
నిజానికి కోళ్ల ఫారాల యజమానులు చాలా చోట్ల కోళ్లను ఉచితంగా ఇవ్వడమూ.. చికెన్ పార్టీలు ఉచితంగా ఇవ్వడమూ కూడా జరిగింది. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియవని, లేదా, తాను చెప్పే కబుర్లను ప్రజలు నమ్ముతారని అఖిలమ్మ ఎలా అనుకున్నదో గానీ.. చాలా అందంగా అల్లుతున్నదని ప్రజలు అంటున్నారు.
ఎంతైనా అతి నిజాయితీగా అల్లిన గుండెపోటు కథలు కంటేనా??
కథలు అల్లడంలో చేపకి ఈత నేర్పించిన మా 11మోహన తర్వాతే ఎవ్వరైనా..
మట్టి ఇసుక mines, belt shops సరిపోలేదా అఖిలమ్మా, అమ్మిన ప్రతి కిలో కి నీ tax 10. దోపిడీ కి పరాకాష్ట
Nuvvu rase chillara rathalakantenaa. Okka positive news undadu govt gurinchi. Roads baguchesaaru, amaravathi line lo pettaru, polavaram ki funds techaru, vizag Steele plant ni brathikicharu. These are only few. Suryalanka beach ki 100 crores techaru.