తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సేవలను భక్తులకు అందించడంలో ఏఐ సాంకేతికతను వినియోగించడానికి ప్రభుత్వం, టీటీడీ రంగం సిద్ధం చేస్తోన్నాయి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు దాదాపుగా అన్ని ప్రభుత్వ వ్యవస్థలలోనూ ఏఐ సాంకేతికతను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భక్తులకు తిరుమలేశుని దర్శనం త్వరగా అయ్యేందుకు, గూగుల్ తో ఒప్పందం చేసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.
ఏఐ సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. దీనిద్వారా తిరుమలలో ఎక్కడెక్కడ భక్తుల రద్దీ ఎలా ఉన్నదో భక్తులు ఎప్పటికప్పుడు గూగుల్ ద్వారా తెలుసుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు.
ఏఐను తిరుమలలో భక్తుల సేవలకు ఏ రకంగా వాడబోతున్నారో అదంతా బాగానే ఉంది. కానీ తిరుమలలో విచ్చలవిడిగా మారుతున్న దళారుల దందాలను, వారి దోపిడీ పర్వాలను కూడా గుర్తించే ఏఐ సాంకేతికత ఉంటుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబునాయుడు తలచుకుంటే.. దళార్ల మార్గాలకు ఏఐ ద్వారా అడ్డుకట్ట పెట్టడం కూడా పెద్ద సంగతేమీ కాదని ఆశిస్తున్నారు.
దర్శనాలు, వసతితోపాటు వివిధ సేవలకోసం గూగుల్ సాంకేతికత ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏ సమయంలో, ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు.. లాంటి సమాచారం మొత్తం దీని ద్వారా టీటీడీకి ఎప్పటికప్పుడు తెలుస్తుంటుంది. తదనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అలాగే దర్శనానికి సంబంధించిన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన పద్ధతుల గురించి గూగుల్ ఏఐ సాయంతో భక్తులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చు.
అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా.. తిరుమలలో ఏ సమయంలో ఎక్కడెక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నదో అందరూ తెలుసుకుంటూ ఉండవచ్చు. గదులు కేటాయించే సీఆర్వో, హెల్త్ సెంటర్లు, అన్నప్రసాద కేంద్రం, కల్యాణ కట్ట ఇలా వివిధ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు రద్దీ ఎంత ఉంటున్నదో సులువుగా భక్తులు తమ ఫోనులో గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే సమాచారం టీటీడీకి కూడా అందుతూ ఉంటుంది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గదుల కేటాయింపులోను, దర్శనం టికెట్ల విక్రయాల్లోనూ సిఫారసు ఉత్తరాల విషయంలోనూ అనేక రీతుల్లో దళారులు స్వామి భక్తులను దోచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. మోసపోయిన సందర్భాల్లో మాత్రమే ఈ దందాలు ఒకటో రెండో బయటకు వస్తాయి. కానీ ప్రతిరోజూ వందల సంఖ్యలో ఈ దందాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి దళారులకు చెక్ పెట్టడానికి కూడా ఏదైనా ఏఐ సాంకేతికతను హైటెక్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు కార్యరూపంలోకి తీసుకురావాలని భక్తులు కోరుకుంటున్నారు.
తిరుమల లో “దర్శన యాపారం” చేసి కోట్లు కొల్లగొట్టిన అతి పెద్ద దళారీ
“నగరి పిర్రల పంది ” ఏకాడ??
మీ టూత్ పేస్టు లో ఉప్పుందా ?
అర్థం కాలే
“దర్శన దందా యాపారం” చేసి వందల కోట్లు సంపాదించిన అతి పెద్ద దళారీ “నగరి పిర్రల పంది ” ఏకాడ??
Minimize the VIP culture, recommendation letters by MLAs, and MPs. Make the bookings online and release it at least 2 months to plan for the journey. But for the poor who do not use online tools is a challenge to serve them.
ఇది మానవ కృతమైన ప్రయోగం..సృష్టించినోటి పలుకులే…నమ్మక్కరలేదు…మిత్తం ఆంధ్రాని సంకానాకించఏసీ పారిపోతారు..
అందరు మన లగే ఉంటారు అనుకుంటే ఎలా సాయినాధ .. .