లెక్క మ‌న‌ది కాక‌పోతే పీక్క తిందాం.. క‌డ‌ప వైసీపీ తీరు!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శాపం ఉన్న‌ట్టుంది. ఆయ‌న చుట్టూ రాబందుల్లాంటి బంధువులు, కోట‌రీ నేత‌లున్నారు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శాపం ఉన్న‌ట్టుంది. ఆయ‌న చుట్టూ రాబందుల్లాంటి బంధువులు, కోట‌రీ నేత‌లున్నారు. క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ ఎన్నిక నేప‌థ్యంలో ఆ జిల్లాలో ఇలాంటి చ‌ర్చే జ‌రిగింది. క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్‌గా బ్ర‌హ్మ‌గారిమ‌ఠం జెడ్పీటీసీ స‌భ్యుడు రామ‌గోవిందురెడ్డి పేరును వైఎస్ జ‌గ‌న్ కొన్ని నెల‌ల క్రిత‌మే ఖ‌రారు చేశారు.

ఆ సంద‌ర్భంగా రామ‌గోవిందురెడ్డితో “అన్నా రూ.2 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టుకో. ఇప్ప‌టికే మ‌న‌కు కావాల్సినంత బ‌లం వుంది. గెలుపుపై భ‌యప‌డాల్సిన ప‌నిలేదు” అని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంలో ఒక్కొక్క‌రం రూ.50 ల‌క్ష‌లు భ‌రిస్తామ‌ని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, కొర‌ముట్ల శ్రీ‌నివాసులు త‌దిత‌రులు జ‌గ‌న్ ఎదుట చెప్పిన‌ట్టు తెలిసింది.

అప్ప‌టికే రామ‌గోవిందురెడ్డి బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మండ‌లాల‌కు సంబంధించి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో లెక్క ధారాళంగా ఖ‌ర్చు పెట్టిన సంగ‌తి తెలిసే, జ‌గ‌న్ ఆ మాట అన్నారు. రామ‌గోవిందురెడ్డిని జెడ్పీ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా ఎందుకు జ‌గ‌న్ ఎంపిక చేశారో క‌డ‌ప వైసీపీ నాయ‌కులంద‌రికీ తెలుసు. అయితే జ‌గ‌న్ చెప్పిందొక‌టి, జ‌రిగింది మ‌రొక‌టి.

క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ స్థానానికి 27న ఎన్నిక జ‌ర‌గాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. వైసీపీ క్యాంప్ రాజ‌కీయానికి తెర‌లేపింది. ఇందుక‌య్యే ఖ‌ర్చుల‌న్నింటినీ రామ‌గోవిందురెడ్డి పెట్టుకున్నారు. అయితే టీడీపీ కనీసం ఎన్నిక‌ల్లో పోటీ చేసే ప‌రిస్థితి లేద‌ని తెలిసి కూడా, రామ‌గోవిందురెడ్డితో భారీ మొత్తంలో ఖ‌ర్చు చేయించాల‌ని వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఎత్తుగ‌డ వేశారు.

ఒక్కో జెడ్పీటీసీకి రూ.12.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని రామ‌గోవిందురెడ్డికి చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్ వైసీపీ అభ్య‌ర్థికి అస‌లేం జ‌రుగుతున్న‌దో అర్థంకాని ప‌రిస్థితి. అడ్వాన్స్‌గా ఒక్కో జెడ్పీటీసీకి రూ.5 ల‌క్ష‌లు ఇచ్చి, ఆ త‌ర్వాత రూ.7.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, రాచ‌మ‌ల్లు ష‌ర‌తు విధించారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆ ష‌ర‌తుకు అంగీక‌రించి, జెడ్పీ చైర్మ‌న్ ఎన్నిక‌కు రామ‌గోవిందురెడ్డి సిద్ధం కావాల్సిన అనివార్య ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నిజంగా జెడ్పీటీసీ స‌భ్యుల‌కు ఆర్థికంగా సాయం చేయాల‌నే పెద్ద మ‌న‌సు జ‌గ‌న్ మేన‌మామ‌, వైఎస్సార్ క‌డ‌ప వైసీపీ జిల్లా అధ్య‌క్షుడైన ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి వుంటే… సీకేదిన్నె జెడ్పీటీసీ స‌భ్యుడైన త‌న కుమారుడు న‌రేన్‌ను చైర్మ‌న్‌గా నిలిపి, ఒక్కొక్క‌రికి రూ.20 ల‌క్ష‌లు ఇచ్చి వుండొచ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ అధికారంలో వుంటే, అన్ని ర‌కాలుగా మొట్ట‌మొద‌ట సొమ్ము చేసుకునేది జ‌గ‌న్ రాబంధుల్లాంటి బంధువులే. అధికారం లేనప్పుడు మాత్రం …ఇత‌రుల నెత్తిన చెయ్యి పెడుతుంటార‌ని క‌డ‌ప‌లో ఎవ‌రిని అడిగినా చెబుతారు. ఇలాగైతే పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్టేదెట్టా? అనే ఆవేద‌న‌తో ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోలేదు.

జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు సంపాదించుకున్న సొమ్ములో క‌నీసం ప‌ది శాతం లెక్క ఖ‌ర్చు పెట్ట‌డానికి కూడా జ‌గ‌న్ రాబందుల‌కు మ‌న‌సు రావ‌డం లేద‌నేది బ‌ల‌మైన విమ‌ర్శ‌. రామ‌గోవిందురెడ్డితో అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు పెట్టించ‌డంపై త‌న మేన‌మామ‌ను జ‌గ‌న్ తిట్టిన‌ట్టు స‌మాచారం. అయినా ఇవ‌న్నీ మామూలే క‌దా అని తుడుచుకుని పోయేవాళ్ల గురించి ఎవ‌రైనా ఏం మాట్లాడ్తారు? అని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.

21 Replies to “లెక్క మ‌న‌ది కాక‌పోతే పీక్క తిందాం.. క‌డ‌ప వైసీపీ తీరు!”

  1. మొత్తానికి చెప్పేది ఏంది అంటే…అధికారం లో ఉన్నప్పుడు బంధువులు, కోటరీ రాబందుళ్ల తిన్నారు అంటావా?

  2. ఎందిరయ్యా సామి ఇది …..ఒకరికి పన్నెండున్నర లక్ష ycp members పంచిందె 5’25’00’000.₹……ఈ లెక్కన వాల్లను కాపలాకాసి దాచినందుకు TA…DA…లు వామ్మో……ఇదంతా వారి సంపాదనలొ పదిశాతం కుడా లెదు ……ఈ లెక్కన ……సామి…..151 మంది mla లు వారి బందుగణం….మన్సిపల్ ..కార్పొరెషన్ చైర్మన్ లు కౌన్సిలర్ లు ఇంకా …..బ్లా….బ్లా…బ్లా……చాలమంది దోచుకున్నది ఎంత లెక్క గట్టచ్చు GA సార్

  3. ఇంతకీ జగన్ సుద్ద పూస అంటావ్. నోట్లో వేలు పెడితే కొరక్కైండ ముక్కులో తోపుకు నే అమాయకుడు అంటావ్.

    ఇసు*క, మ*ద్యం, మై*నింగ్, మీడి*యా , గం*జాయి, … అబ్బో లెక్క లేదు,

    ఆఖరికి స*మోసా లని కూడా వదల కుండా ప్రజల డబ్బు నొక్కేశాడు కదా.

    మరి , ఆ డబ్బే*దో జగ*న్ జే*బు లో నిండి ఇవ్వాలి కదా.

  4. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు cb

  5. ఇంతకీ ఆ డబ్బు జగన తిరిగి ఇచ్చాడా లేదా!

    జగన తన మామ నీ తిట్టినప్పుడు , గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు అన్న మాట.

    మరి, రోజు వెబ్సైట్ లో జగన్ ఇలా చేస్తే బాగా వుండేది అనే విషయాలు , అక్కడే జగన కి చెప్పారా వెంకట్ రెడ్డి గారూ.

  6. జగన్ సుద్ద పూస, ఒక్క రూపాయి కూడా తినలేదు అని గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డిగారు జనాలని నమ్మ మంటున్నారు. నమ్మెద్దాం బ్రో. ఆ 11 సీట్లు కూడా పోతాయి ఈ సారి.

  7. ఎందిరయ్యా సామి ఇది …..ఒకరికి పన్నెండున్నర లక్ష ycp members పంచిందె 5’25’00’000.₹……ఈ లెక్కన వాల్లను కాపలాకాసి దాచినందుకు TA…DA…లు వామ్మో……ఇదంతా వారి సంపాదనలొ పదిశాతం కుడా లెదు ……ఈ లెక్కన ……సామి…..151 మంది mla లు వారి బందుగణం….మన్సిపల్ ..కార్పొరెషన్ చైర్మన్ లు కౌన్సిలర్ లు ఇంకా …..బ్లా….బ్లా…బ్లా……చాలమంది దోచుకున్నది ఎంత లెక్క గట్టచ్చు GA సార్

  8. ఎందిరయ్యా సామి ఇది …..ఒకరికి పన్నెండున్నర లక్ష ycp members పంచిందె 5’25’00’000.₹……ఈ లెక్కన వాల్లను కాపలాకాసి దాచినందుకు TA…DA…లు వామ్మో……ఇదంతా వారి సంపాదనలొ పదిశాతం కుడా లెదు ……ఈ లెక్కన ……సామి.గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తంమిద…….151 మంది mla లు వారి బందుగణం….మన్సిపల్ ..కార్పొరెషన్ చైర్మన్ లు కౌన్సిలర్ లు ఇంకా …..బ్లా….బ్లా…బ్లా……చాలమంది దోచుకున్నది ఎంత లెక్క గట్టచ్చు GA సార్

  9. ఎందిరయ్యా సామి ఇది …..ఒకరికి పన్నెండున్నర లక్ష ycp members పంచిందె 5’25’00’000.₹……ఈ లెక్కన వాల్లను కాపలాకాసి దాచినందుకు TA…DA…లు వామ్మో……ఇదంతా వారి సంపాదనలొ పదిశాతం కుడా లెదు ……ఈ లెక్కన ……సామి.గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తంమిద…….151 మంది mla లు వారి బందుగణం….మన్సిపల్ ..కార్పొరెషన్ చైర్మన్ లు కౌన్సిలర్ లు ఇంకా …..బ్లా….బ్లా…బ్లా……చాలమంది దోచుకున్నది ఎంత లెక్క గట్టచ్చు GA సార్

  10. వార్ని, వైసీపీ “విజయాడంకా రహస్యం” ఇదా..!

    2 కోట్లు ఖర్చుపెట్టినోడు 200 కోట్లు అక్రమ0గా సంపాదించి అందులో 100 కోట్లు జెగ్గులు అండ్’ వాడి రాబ0ధులకి ఇవ్వాలి

  11. Mari intoti daaniki kadapa jagan reddy adda ani lanja build up Enduku

    ..

    Dabbuao konukkunna seats gurunchi demalenduku rankukka…eppudo veedu jump..mottam modda gudici potundi..

  12. టీడీపీ పోటీలో లేకపోయినా ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే వాళ్లలో వాళ్ళకే నమ్మకాలు లేవు అని అర్ధం.

Comments are closed.