కూట‌మి పాల‌న‌పై వైసీపీ విజ‌య ఢంకా

ఇక‌పై ప్ర‌జ‌ల‌తో సంబంధం ఉండే ఏ ఎన్నిక‌లు జ‌రిగినా, కూట‌మి భ‌య‌ప‌డాల్సిన దుస్థితిని కూట‌మి కొని తెచ్చుకుంది.

కూట‌మి ప‌ది నెల‌ల పాల‌న‌పై వైసీపీ విజ‌య ఢంకా మోగించింది. అన్నింటికంటే కాలం చాలా గొప్ప‌ద‌ని మ‌రోసారి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల్లో న‌మోదు చేసుకున్న విజ‌యాలు నిరూపించాయి. స‌రిగ్గా ప‌ది నెల‌ల క్రితం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందింది. కేవ‌లం 11 ఎమ్మెల్యే సీట్లు, నాలుగు పార్ల‌మెంట్ స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. దీంతో వైసీపీ, అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది.

కాలం ప‌ది నెల‌లు గిర్రున తిరిగింది. ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. వైసీపీ శ్రేణుల్లో క‌సి పెంచింది. వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంపై స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్లో న‌మ్మ‌కాన్ని మ‌రింత బ‌లోపేతం చేసింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ర‌కాలైన 50 స్థానిక సంస్థ‌ల సీట్ల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా, వాటిలో వైసీపీ ఏకంగా 39 గెలుపొంది, కూట‌మికి భారీ షాక్ ఇచ్చింది. క‌డ‌ప జెడ్పీ చైర్మ‌న్‌తో పాటు 18 ఎంపీపీలు, 12 వైస్ ఎంపీపీలు, 8 కోఆప్ష‌న్ స్థానాల్లో వైసీపీ విజ‌య ఢంకా మోగించింది.

రాజ‌కీయంగా వైసీపీ ప‌ని అయిపోయింద‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కల్యాణ్‌తో పాటు కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో, ఈ విజ‌యాలు వాళ్ల‌కు చెంప‌పెట్టు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ న‌మోదు చేసుకున్న విజ‌యాలు, కూట‌మిని ఎంత‌గా భ‌య‌పెడుతున్నాయంటే… క‌నీసం వాళ్ల అనుకూల ప‌త్రిక‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న స‌మాచారం తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేంత‌.

ఘోర ప‌రాజ‌యం పాలై, దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న వైసీపీని అలా వ‌దిలేసి వుంటే… ఇవాళ ఇలాంటి ఫ‌లితాలు వ‌చ్చేవి కావు. కానీ మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ పాల‌న పుణ్యాన‌… వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని ర‌క‌ర‌కాలుగా వేధించారు. ఇంకా కొన్ని చోట్ల వేధిస్తున్నారు. దీంతో కూట‌మిని గ‌ద్దె దింప‌డం, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చుకోవ‌డం త‌మ అవ‌స‌రంగా వైసీపీ శ్రేణులు ప‌ట్టుప‌ట్టేలా చేసింది. వైసీపీ ద్వితీయ, తృతీయ నాయ‌క‌త్వంలో ప‌ట్టుద‌ల‌కు, క‌సికి ప్ర‌తిబింబంగానే… స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యాల్ని చూడాల్సి వుంటుంది.

కూట‌మి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ల‌రు ఎంత‌గా ప్ర‌లోభ‌పెట్టినా, త‌లొగ్గ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కూట‌మి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని, ఏదైతే అద‌వుతుందిలే అనే తెగింపు వాళ్ల‌లో క‌నిపించింది. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌కుప్పం ఎంపీపీ ఎన్నిక నిలువెత్తు నిద‌ర్శ‌నం.

సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌కుప్పాన్ని ద‌క్కించుకోక‌పోతే, ప‌రువు పోతుంద‌ని స్థానిక టీడీపీ నాయ‌కులు ఎన్నో ర‌కాలుగా వైసీపీ ఎంపీటీసీలు, వాళ్ల మ‌నుషుల్ని ప్ర‌లోభాల‌కు గురి చేశారు. తీవ్రంగా భ‌య‌పెట్టారు. కానీ ఎంపీపీని నిజాయితీగా సొంతం చేసుకునే సంఖ్యా బ‌లాన్ని సొంతం చేసుకోలేక‌పోయారు. చివ‌రికి కోరం లేకుండానే టీడీపీ మ‌ద్ద‌తుదారులే ఎంపీపీ ప‌ద‌విని గెలుచుకున్న‌ట్టు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. దీనిపై వైసీపీ న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌వుతోంది.

తాజాగా వైసీపీ జ‌రిపిన వీరోచిత పోరాటం, మ‌రో ఏడాదిలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలా? వ‌ద్దా? అని సీఎం చంద్ర‌బాబును భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ఒక‌వేళ మ‌రో ఏడాదిలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే, కూట‌మికి వైసీపీ చుక్క‌లు చూప‌డం ఖాయం. ఎందుకంటే, భ‌యం అంటే ఏంటో తెలియ‌కుండా చేసిన ఘ‌న‌త లోకేశ్ రెడ్‌బుక్‌కు ద‌క్కింది. పిల్లిని ఇంట్లో వేసి కొడితే అదే పులిలా తిర‌గ‌బ‌డుతుంద‌నే నానుడిని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గుర్తు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం హామీలేవీ అమ‌లు చేయ‌లేద‌నే కోపంతో ఉన్నారు. త‌మ అసంతృప్తిని వెల్ల‌డించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇక‌పై ప్ర‌జ‌ల‌తో సంబంధం ఉండే ఏ ఎన్నిక‌లు జ‌రిగినా, కూట‌మి భ‌య‌ప‌డాల్సిన దుస్థితిని కూట‌మి కొని తెచ్చుకుంది. ప‌ది నెల‌ల క‌క్ష‌పూరిత పాల‌న సాధించిన ఓట‌మి ఇది అని చెప్ప‌క త‌ప్ప‌దు.

24 Replies to “కూట‌మి పాల‌న‌పై వైసీపీ విజ‌య ఢంకా”

  1. ప్రజలు ఓట్లు వేసే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కనీసం పోటీ చెయ్యడానికే భయపడి బెంగళూరు లో దాక్కున్నావ్, ఇప్పుడు నీ బానిసలతో ఓట్లయించుకుని, నీకు నువ్వే డప్పు కొట్టుకుని విజయాడంకా అంటే ఎట్టా 11మోహనా??

    1. Meelaage 2017 lo kadapa MLC election lo YS viveka meeda banisalatho votes veyinchukuni, YS family meeda kadapa lo gelichaam ani meeru dappu kottukunnatle undi.

  2. ఒరేయ్ సన్నాసి …ఎన్నిక జరిగిన 53 వైసీపీ సిట్టింగ్ స్థానాలు… అందులో 40% ఓడింది ఆంటే, ఎవరి విజయ ఢంకా

  3. Sir aa MPP lu. ప్రజల ఓట్ల తొ జరిగినవి కావు . అవి M P T C lu గతం లో ఎన్నికయ్యారు appidubycp ఎక్కువే గెలిచింది ఆ ఎంపీటీసీ లె ఇప్పుడు మల్ల. ఎంపీపీ లను ఎన్నుకొనే ఇండైరెక్ట్ ఎన్నికలు ఇవి

    1. అయినా.. ఏం లాభం.. వీళ్ళను తుని తిరుపతి వైజాగ్ లో లా.. కిడ్నపులు..బెదిరింపులు.. వాళ్ళ బిల్డింగులు తిరుపతిలో కూల్చినట్టు చెయ్యలేక పోయారు గా?

      ఒకవేళ.. అక్కడ ప్రతిపకశ పార్టీ వైసీపీ ఓడిపోయి ఉంటె.. ఈ మాట అనేవాడివా? ఇంకో రకంగా కదా చెప్పేవాడివి.

      50 చోట్ల ఎన్నికలు జరిగితే.. 41 చోట్ల గెలిచింది ప్రతిపక్ష వైసీపీ.

      9 చోట్ల.. కూటమి గెలిచింది. అందులో.. టీడీపీ 7 జనసేన ఒకటి బీజేపీ ఇంకొకటి!

        1. నీకు ఆరోగ్యం సరిగా లేనట్టుంది.. గెలిస్తే… ఆనందించాలి గా?

          ఆరోగ్యం జాగ్రత్త రోయ్!

          పాపం..తుని తిరుపతి వైజాగ్ లో లా.. కిడ్నపులు..బెదిరింపులు.. వాళ్ళ బిల్డింగులు తిరుపతిలో కూల్చినట్టు చెయ్యలేక పోయారు గా? మరి ఆనందించద్దు? హహహహా

          1. జిల్లా ఎన్నికలు .. గ్రామా పంచాయతీ స్థాయికి పడి పోయింది .. ఇవి గెలిచి ఆనందించడమే ..

  4. గతంలో జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికలు ఎంత సక్రమంగా జరిగాయా లోకం అంతా చూసుంది..

  5. వైసీపీ నాయకులు వేసే ఓట్లు కూటమికి ఎలా పడుతాయు… సామాన్య ప్రజలు ఏమైనా పాల్గొన్నారా

  6. Cbn range entaki padipoyindi ante chivaraki mpp, corporator kidnap..

    shame on him for abusing police power..

    actually ee racha entha jarigithe antha melu..

    already cbn gaadiki enduku vote vesama ani janalu..

Comments are closed.